Warner promises ‘hatred’ and ‘war’ with England యాషెస్ సిరీస్: మైండ్ గేమ్ ప్రారంభించిన అసీస్

David warner promises hatred and war with england in ashes

Ashes 2017-18, David Warner, England cricket team, Australia cricket team, Steve Smith, Australia sport, Cricket, The Ashes, Sport, latest sports news, sports news, latest news, cricket news, cricket

Australia’s chief agitator David Warner has fired the opening shots in the Ashes war of words, revealing the hosts will be motivated by their “hatred” of England.

యాషెస్ సిరీస్: మైండ్ గేమ్ ప్రారంభించిన అసీస్

Posted: 10/16/2017 04:28 PM IST
David warner promises hatred and war with england in ashes

యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై అప్పుడే అస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించింది. సిరీస్ కోసం పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్ ను లక్ష్యంగా చేసుకొని మాటలు సంధిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో క్రికెట్ ఆడటమంటే ‘యుద్ధం’ లాంటిదే అని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ అన్నారు. 2013లో బ్రిస్బేన్ లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పేస్ దాడికి ఇంగ్లిష్‌ ఆటగాళ్ల కళ్లలో భయం కనిపించిందని అప్పడు వార్నర్‌ అన్నారు. త్వరలో జరిగే యాషెస్‌ సందర్భంగా ఇలాంటి మాటలతోనే కవ్వింపులు మొదలుపెట్టారు.

తమకు గర్వించదగ్గ చరిత్రతో పాటు గర్వ కూడా వున్నాయని అన్నారు. ఎప్పుడైతే ఆ బాటలో అడుగు పెడతామో అప్పుడది యుద్ధమేనన్నారు. వీలైనంత త్వరగా పోరులో అడుగు పెట్టేందుకు ప్రయత్నించాలన్నారు. తాను ప్రత్యర్థి కళ్లలోకి నేరుగా చూస్తూ అతడిపై ఎలా అయిష్టత పెంచాలన్న దానిపై పనిచేస్తానన్నారు. అతడిపై ఆధిపత్యం చలాయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే అలాంటి నిప్పు రవ్వలు రాజేయాలని అన్నారు.  

వారిపై అలాంటి శత్రుత్వం పెంచుకుంటేనే శక్తివంచన లేకుండా కసితో పోరాడగలమని వార్నర్‌ అన్నారు. వారం క్రితమే ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను లక్ష్యంగా చేసుకోవాలని అతడిపై ద్వేషం ప్రదర్శించాలని మిచెల్ స్టార్క్ అభిమానులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. యాషెస్‌ సిరీస్ ను ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఇది భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరును తలపిస్తుంది. ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర ఉద్వేగంతో ఉంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashes 2017-18  David Warner  The Ashes  Steve Smith  Australia sport  Cricket  

Other Articles