Ashish Nehra unperturbed by Twitter jokes on him డబ్బుల కోసం క్రికెట్ ఎప్పుడూ అడలేదు..

Evergreen ashish nehra and the art of swinging back to the forefront

Ashish Nehra, Nehra age,Nehra Twitter,Indian cricket team,India T20I squad,India vs Australia,India vs Australia T20Is,Ashish Nehra T20Is,Ashish Nehra Australia,Ashish Nehra meme,Nehra social media,Virat Kohli,India vs Australia Ashish Nehra, cricket news, sports news, sports, cricket

The veteran pacer, who still clocks serious pace, revealed he was using the time away from the Men in Blue by working hard for his comeback and not on social media.

డబ్బుల కోసం క్రికెట్ ఎప్పుడూ అడలేదు..

Posted: 10/03/2017 07:00 PM IST
Evergreen ashish nehra and the art of swinging back to the forefront

ఆస్ట్రేలియాతో 3 మ్యాచుల టీ20 సిరీస్ లో స్థానం సంపాదించుకున్న టీమిండియా సీనియర్ మీడియం పేసర్ .. ఆశిష్‌ నెహ్రా జట్టులో చోటు దక్కడంపై స్పందిస్తూ.. టీమిండియా జట్టులో స్థానం లభించడం.. దేశం కోసం అడటంతో ఎవరికి మాత్రం అనందంగా వుండదని అన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో బరిలోకి దిగిన నెహ్రా.. గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో మళ్లి ఫిట్ గా మారిన నెహ్రాను జట్టు సెలక్టర్లు అసీస్ తో టీ20లకు ఎంపిక చేశారు. తన వయస్సు దృష్ట్యా దీర్ఘకాల లక్ష్యాలేమీ నిర్ధేశించుకోనని చెప్పాడు.

ఈ సందర్భంగా నెహ్రా మాట్లాడుతూ.. 3 టీ20 మ్యాచుల కోసం తనను ఎంపిక చేశారని, అయితే తాను ఒక్కో టీ20 కోసం అలోచిస్తానని చెప్పారు. తాను అడితే వార్తేనని చెప్పిన నెహ్రా.. తాను అడకపోతే మరింత పెద్ద వార్త అవుతుందని కూడా చెప్పారు. తన గురించి సామాజిక మాద్యమంలో ఎవరేం మాట్లాడుతున్నారో కూడా తెలియదని, అందుకు కారణం తాను సోషల్ మీడియాను ఫాలో కానని చెప్పాడు. అయితే సోషల్‌ మీడియాలో కనిపించడు.. ఇప్పుడు టీమీండియాలోకి వచ్చాడని నెట్ జనులు చర్చించుకోవచ్చునని అన్నాడు.

అయితే గాయం బారిన పడిన తాను ఈ సమయంలో తన శిక్షణ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నానని, ఫూర్తి ఫిట్ గా తయారై వచ్చానని అన్నారు. తానేం చేస్తున్నానో కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు పూర్తిగా తెలుసునని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తన అంతర్జాతీయ కెరీర్‌ 19 ఏళ్ళు పూర్తవుతుందని, చెప్పాడు. తాను హర్భజన్‌.. అజహారుద్దీన్ సారథ్యంలో అరంగేట్రం చేశామని గుర్తు చేసుకున్నాడు. అజ్జూ ఆధ్వర్యంలో ఆట మొదలుపెట్టిన ఆటగాడిని ప్రస్తుత జట్టులో వున్నది తానొక్కడినేని చెప్పిన నెహ్రా.. ఈ ప్రయాణంలో తాను ఎప్పుడూ డబ్బుల కోసం మ్యాచ్ అడలేదని కూడా తెలిపాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashish Nehra  Indian cricket team  Ind Aus T20Is  India vs Australia  IND vs AUS  cricket  

Other Articles