Pandya Clears The Air About 'Mystery Girl' సస్పెన్స్ కు తెరదించిన హార్థిక్ పాండ్య

Hardik pandya clears the air about mystery girl in viral photo

India vs australia, Team India, Hardhik pandya, India vs australia, Team India, Hardik Himanshu Pandya, India vs Australia 2017, india cricket team, viral photo, virat kohli, steve smith, cricket news, sports news, sports, cricket

Indian cricketer Hardik Pandya took to Twitter to clear the air about the 'mystery girl' in a photo that has gone viral on social media.

ట్విట్టర్ ద్వారా సస్పెన్స్ కు తెరదించిన పాండ్య

Posted: 10/03/2017 05:53 PM IST
Hardik pandya clears the air about mystery girl in viral photo

అస్ట్రేలియాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ లలో రాణించి.. తన సత్తా ఏమిటో భారత క్రికెట్ అభిమానులకు చూసిన యువ అల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య.. ఇటీవల సామాజిక మాద్యమం వేదికగా తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అందుకు కారణం పాండ్యతో పాటుగా ఓ యువతి కూడా కలసి సెల్పీ దిగింది. అదే ఫోటోను పాండ్యా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారి నెట్ జనులు రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. ఈ ఫొటోపై పాండ్యా అభిమానులు కామెంట్లు కూడా దండిగా పెట్టేశారు.

పాండ్య ప్రేమలో పడ్డాడా? అంటూ కొందరు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించగా, ‘పాండ్య త్వరగా ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటో చెప్పెయ్‌’ అంటూ అభిమానులు పెద్ద సంఖ్యలో కామెంట్లు గుప్పించారు. ఇక మరికొందరు మరో విధంగా కామెంట్ చేశారు. మిస్టరీ గాళ్ అంటూ సస్పెన్స్ కు తెరలేపిన పాండ్యా.. ఇవాళ నెట్ జనులు ప్రశ్నలకు పాండ్యా తెరదించారు. అదినూ అలాఇలా కాకుండా ఏకంగా ఎవరూ మరేం మాట్లాడకుండా చెక్ పెట్టేశాడు. అదెలా అంటారా..

‘మిస్టరీ వీడింది. ఆమె నా సోదరి’ అని అభిమానుల వూహాగానాలకు చెక్ పెట్టేశాడు. అయితే అంతకుముందు గత నెలలో బాలీవుడ్ సినీనటి పరిణితి చోప్రాతో అయన చాటింగ్ మెసేజ్ ను చూసిన నెట్ జనులు పాండ్యాకు, పరిణితికి మధ్య అహా, ఊహూలు నడుస్తున్నాయంటూ ఎన్నో రకాలుగా ప్రేమ వదంతులు సృష్టించారు. అయితే వాటిపై కూడా ఇలానే ఘాటుగా స్పందించిన పాండ్యా.. అమె ఎవరో కూడా తనకు సరిగా తెలియదని, అమెతో ఇప్పటి వరకు అసలు మాట్లాడలేదని కూడా చెప్పారు. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ కూడా నడుస్తుందన్న వార్తలకు చెక్ పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles