play 100 percent to beat India, says Aaron Finch ఉపఖండంపై గెలవాలంటే నూరుశాతం అడాల్సిందే..

India showing they are a class above says aaron finch

india vs australia, ind vs aus, aaron finch, finch india, harbhajan singh, virat kohli, hardik pandya, steve smith, ms dhoni, michael clarke, india aus odi series, cricket news, sports news

Australia trail India 0-3 in the on-going ODI series and will only play for pride in the remaining two matches of the 50-over series in Bengaluru and Nagpur.

ఉపఖండంపై గెలవాలంటే నూరుశాతం అడాల్సిందే..

Posted: 09/26/2017 07:04 PM IST
India showing they are a class above says aaron finch

ఉపఖండంలోని పిచులపై అడి గెలవాటంలే నూరు శాతం అడాల్సిందే తప్ప మరో మార్గం లేదని అస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా తాము ఓ అడుగు ముందున్నామని భావిస్తుందని అయితే ఇక్కడ అది వారి గోప్పతనం కాదని కూడా అన్నాడు. తమ జట్ట స్వదేశంలో కాకుండా విదేశాలలో అడిన గత 13 మ్యాచులలో 11 ఓడిపోయామని, మరో రెండు వార్షార్ఫణం అయ్యాయని ఆయన అసలు విషయాన్ని చెప్పాడు. తాను జట్టులోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఇంతటి కఠిన సమాయన్ని ఇప్పుడే చూస్తున్నానని అన్నాడు.

కాలి పిక్క కండరం పట్టేయడంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఫించ్‌ మూడో వన్డేలో శతకంతో రాణించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు వన్డేల్లో గెలిచి కోహ్లి సేన సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఫించ్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ వెబ్ సైట్ తో ముచ్చటిస్తూ అసీస్ విదేశీ గడ్డలపై విజయాలను సాధించాలంటే నూరు శాతం అడితే చాలునని తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తమ జట్టు ఎంత మంచి ప్రదర్శన చేసినా.. విదేశీ గడ్డలపై ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో అదే అందోళన జట్టు అటగాళ్లలో కనబడుతుందని అన్నాడు. ఇలా గత 10 మ్యాచుల్లో 9 ఓడిపోయామని అన్నారు.  ఇదే పరిస్థితి భారత్ లో కూడా ఎదురైందని అన్నాడు. భారత్ లో టీమిండియాను ఢీకొట్టాలంటే 100 శాతం ఆడాల్సిందేనని అన్నారు. 90 శాతం ఆడినా ఫలితం తారుమారు అవుతుందని ఫించ్ అభిప్రాయపడ్డాడు. కాగా అసీస్ తో సిరీస్ ను గెలిచిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్ లలో నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : india vs australia  ind vs aus  aaron finch  finch india  india aus odi series  cricket  

Other Articles