team india rushes into top spot of icc odi rankings టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లనున్న టీమిండియా

Virat kohli led team india rushes into top spot of icc odi rankings

India vs australia, Team India, Record win, virat kohli, steve smith, bhuvneshwar kumar, jasprit bumrah, india cricket team, India v Australia,Bumrah,Steve Smith,Smith,Pandya,Jasprit Bumrah,Bhuvneshwar Kumar,Bhuvneshwar,Adam Zampa, australia vs india, cricket news, sports news, sports, cricket

This is the first time that team india which tops top rank in icc odi ranking, but should be declared officially

టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లనున్న టీమిండియా

Posted: 09/25/2017 05:46 PM IST
Virat kohli led team india rushes into top spot of icc odi rankings

ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సత్తా చాటింది. వరుసగా అప్రతిహాతంగా తొమ్మిది మ్యాచులలో విజయాలను సాగిస్తున్న టీమిండియా అసీస్ నుంచి కూడా వన్డే సిరీస్ కైవసం చేసుకుని వరుసగా అరో వన్డే సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు గతంలో లిఖించుకున్న రికార్డలను తనకు తానే తిరగరాసుకునేందుకు కూడా రెడీ అవుతుంది. దీంతో ఇక టీమిండియా వన్డే ర్యాకింగ్ లలో కూడా తొలిస్థానాన్ని అధిరోహించేందుకు సిద్దమైంది.

ఇండోర్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ లో గెలుపుతో సిరీస్ ను కైవసం చేసుకోవాలని ముందునుంచే ప్రణాళికలు రచించుకున్న టీమిండియా.. తమ ప్రణాళికబద్దంగానే అడి అసీస్ పై విజయాన్ని చాటుకుంది. అయితే అసీస్ పాలిట అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో కంగారులను ఓ అడటాడుకున్న టీమిండియా బౌలర్లు.. బ్యాటింగ్ సమయంలో అసీస్ బౌలర్లను ఓ అటఅడుకుంది. దీంతో మూడో వన్డేను గెలిచిన విరాట్ సేన ఐదువన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

ఈ గెలుపుతో ధోనీ రికార్డును కెప్టెన్‌ కోహ్లీ సమం చేశాడు. వరుసగా ఆరో సిరీస్‌ను కైవసం చేసుకొని రాహుల్‌ ద్రవిడ్‌, ధోనీ సరసన నిలిచాడు విరాట్‌. ఇండోర్‌ వన్డేలో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య 72 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 పరుగులు , రహానె 76 బంతుల్లో 9 ఫోర్లతో 70 పరుగులు , రోహిత్‌ శర్మ 62 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71పరుగులతో కదం తొక్కారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles