Shane Warne cleared of assaulting porn star మోడల్ పై దాడి కేసులో వార్న్ వివరణ

Legendary spinner shane warne cleared of assaulting valerie fox

Australian bowler, Cricket, glamour model, London, Shane Warne, porn star, popular model, Legendary spinner, Valerie Fox, cricket news, sports news, sports, cricket

Valerie has recorded an official complaint to police officials and also uploaded the alleged bruises she received during the noisy altercation with the former Australian spinner, who is no stranger to controversies.

మోడల్ పై దాడి కేసులో వార్న్ ఏమన్నాడంటే..

Posted: 09/25/2017 04:44 PM IST
Legendary spinner shane warne cleared of assaulting valerie fox

లండన్ లోని నైట్ క్లబ్ లో శృంగార తార, మోడల్ పై తాను అనుచితంగా ప్రవర్తించానన్న వార్తలను అస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఖండించాడు. అవార్తలన్నీ సత్యదూరమని స్పష్టం చేశాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వివాదం సమసిపోయిందని ధీమా వ్యక్తం చేశాడు. తనపై షేన్ వార్న్ దాడి చేశాడని, పేరు ప్రఖ్యాతులుంటే తప్పు చేసి తప్పించుకోలేడని తెలుపుతూ జరిగిన సంఘటనను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించి.. ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన శృంగార తార వలరీ ఫాక్స్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని వార్న్ చెప్పాడు.

అయితే వల్లెరీ ఫాక్స్ పిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తనను విచారించారని ఆయన చెప్పాడు. తాను వారికి పూర్తిగా సహకరించానని, అయితే నైట్ క్లబ్ ఘటనలో తన తప్పు లేదని పోలీసులు కూడా భావిస్తున్నారని స్పష్టం చేశాడు. తనపై వచ్చిన అరోపణలపై పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలించారు, స్థానికులతో మాట్లాడారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని గుర్తించారని అన్నారు. తనపై చర్యలు లేవని చెప్పారని ఆయన తెలిపారు. పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ వార్తలకు తెరదించాలని ఆయన మీడియాకు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian bowler  Cricket  glamour model  London  Shane Warne  Valerie Fox  cricket  

Other Articles