MS Dhoni nominated for Padma Bhushan మహేంద్రుడికి పద్మభూషణం.. బిసిసిఐ సిఫార్సు..

Bcci nominate mahendra singh dhoni for padma bhushan award

MS Dhoni, Padma Bhushan, Mahendra Singh Dhoni, Sachin Tendulkar, Rahul Dravid, Kapil Dev, BCCI, india Cricket, cricket news, cricket, sports news, latest cricket news, latest sports news, cricket

The Indian cricket board has nominated Mahendra Singh Dhoni for the country's third highest civilian award - the Padma Bhushan - for his contribution to the game.

మహేంద్రుడికి పద్మభూషణం.. క్రీడాశాఖకు బిసిసిఐ సిఫార్సు..

Posted: 09/20/2017 06:53 PM IST
Bcci nominate mahendra singh dhoni for padma bhushan award

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించనుందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు మహేంద్రుడి పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. జనవరి 26న దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విభాగాల్లో రాణించిన ప్రముఖులకు కేంద్రం పురస్కరాలను అందించనుంది. ఈ క్రమంలో ఇప్పటికీ రాజీవ్ ఖేల్ రత్నా, ప్రద్మశ్రీ పురస్కారాలను అందుకున్న ధోనికి మరో పురస్కారం కూడా అందించాలని కొరుతూ బిసిసిఐ క్రీడామంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.

భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు గుర్తింపుగా దేశంలో మూడో అత్యున్నత పురస్కారానికి ‘మిస్టర్‌ కూల్‌’ పేరును ప్రతిపాదించింది. పద్మ అవార్డులకు ఈ ఏడాది ధోని పేరు మాత్రమే సిఫారసు చేసినట్టు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని పేరును ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు నామినేట్‌ చేశారని తెలిపారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలిపారు.

మన దేశానికి చెందిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు. వన్డేల్లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. 90 టెస్టు మ్యాచులు ఆడాడు. కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని 302 వన్డేలు ఆడి  9737 పరుగులు సాధించాడు. 90 టెస్టుల్లో 4876 పరుగులు.. 78 అంతర్జాతీయ టి20 మ్యాచుల్లో 1212 పరుగులు చేశాడు. 36 ఏళ్ల ధోని ఇప్పటికీ వికెట్ల మధ్యన శరవేగంగా పరుగులు తీస్తాడు. ఈ అవార్డు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంపపెట్టు అని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  BCCI  Padma Bhushan award  cricket  

Other Articles