We Need MS Dhoni In 2019 World Cup: Ravi Shastri ప్రపంచ కప్ లో ధోని అటపై రవిశాస్త్రీ

Ravi shastri s clever answer on ms dhoni world cup

MS Dhoni, India vs Sri Lanka, dhoni 50 runs, Team India, chief coach, Ravi shastri, cricket, cricket news, sports news, latest news

MS Dhoni is a certainty for the 2019 World Cup provided he maintains his current form and fitness, said Indian cricket team coach Ravi Shastri in a recent interview.

ప్రపంచ కప్ లో ధోని అటపై రవిశాస్త్రీ

Posted: 09/14/2017 06:39 PM IST
Ravi shastri s clever answer on ms dhoni world cup

2019 ప్రపంచకప్ ప్రణాళికల్లో ధోని ఉన్నాడా?’ ధోని అసలు ప్రపంచ కప్ అడతాడా..? లేదా..? అన్న ప్రశ్నలుకు గత ప్రపంచ కప్ ముగిసిన నాటి నుంచి అదును దొరికినప్పుడల్లా మీడియా ప్రస్తావిస్తూనే వుంది. ఇక దీనికి తోడు ఆయన పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు కూడా వదులుకోవడంతో.. టీమిండియా అభిమానులతో కూడా ఈ విషయమై అందోళన రేకెత్తింది. కాగా ఈ విషయమై ఇటీవల టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రపాద్ చేసిన విమర్శలతో ఆయనపై ధోని అభిమానులు విమర్శలు గుప్పించారు.

ఇక తాజాగా ఇదే ప్రశ్నకు టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తెలివైన సమాధానం టీమిండియా అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. భారత క్రికెట్ జట్టుకు ధోనీ తిరుగులేని శక్తిని, డ్రెస్సింగ్ రూమ్ లో ధోని పెద్దన్న లాంటి వాడని ప్రశంసించారు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనియే అని, అందరికంటే వేగంగా పరిగెత్తగలడని అన్నారు. శ్రీలంకలో ధోని ప్రదర్శన ట్రైలర్ మాత్రమేనని, ధోనీ అసలు ఆటను మున్ముందు చూస్తారని చెప్పిన రవిశాస్త్రి, టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడం ధోనీకి లాభించిందని, వన్డేలకు మరింత ఫిట్ గా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని అన్నారు.

‘2019 ప్రపంచకప్ నేపథ్యంలో ధోని, యువరాజ్ లపై ఓ నిర్ణయం తీసుకోవాలని ద్రవిడ్ అనడంపై..’ అని ప్రశ్నించగా రవిశాస్త్రి సమాధానమిస్తూ, తానేమి సెలెక్టర్ ను కాదని, అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టు ఉండాలన్నది తమ అభిమతమని, టీమ్ ఇండియా జట్టు ఎంపికకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. ఆ ప్రమాణాల మేరకు జట్టు ఎంపికకు అర్హులేనని, ఆ తర్వాత జట్టు కూర్పు, ప్లేయర్స్ ఫామ్ లో ఉండటం అనే అంశాలు పరిగణనలోకి వస్తాయని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India vs Sri Lanka  dhoni 50 runs  Team India  chief coach  Ravi shastri  cricket  

Other Articles