Saha wish for 2019 World Cup will hurt MS Dhoni fans మనస్సులోని మాట చెప్పి.. విమర్శలపాలు..

Wriddhiman saha s wife s wish for 2019 world cup will hurt ms dhoni fans

Wriddhiman Saha, Wriddhiman Saha world cup, Wriddhiman Saha 2019 World Cup, Mahendra Singh Dhoni, MS Dhoni, Wriddhiman Saha Tests, Wriddhiman Saha wicket keeping, India vs Australia, cricket news, sports news, Team India, cricket

After Mahendra Singh Dhoni's retirement from the Test format, Wriddhiman Saha has evolved as the best Indian wicket-keeper in the white outfit

మనస్సులోని మాట చెప్పి.. విమర్శలపాలైన సాహా..

Posted: 09/13/2017 07:11 PM IST
Wriddhiman saha s wife s wish for 2019 world cup will hurt ms dhoni fans

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో అటలో రాణిస్తున్న క్రమంలో తన అభిమానులలో మాత్రం జోష్ పెరుగుతూపోతుంది. ఆయనకు సంబందించి ఏ చిన్నా వ్యతిరేక వ్యాఖ్య వచ్చినా.. ధోని అభిమానులు నెట్టింట్లో తూర్పారబడుతున్నారు. ఇటీవల ధోని అటతీరుపై కామెంట్ చేసి.. ఇది అతనికి చివరి అవకాశమని చెప్పిన టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పై విరుచుకుపడిన అభిమానులు శ్రీలంక వన్డే సిరీస్ లో అతని అటతీరును చూసికూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు.

ఇక తాజాగా.. తన భార్య కోరికను కొల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో బయటపెట్టిన టీమిండియా టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. అదేంటి టెస్టు క్రికెట్ లో ధోని లేడుగా.. అంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. 2019లో జరిగే ప్రపంచ కప్ బరిలోకి దిగే టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవాలని తన భార్య కోరిందని తెలిపిన సాహా.. అమె కోరిక నేరవేర్చందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని.. అయితే తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లేదనని అన్నాడు.

దీంతో మండిపడిన ధోని అభిమానులు ఇప్పటి వరకు తొమ్మిది వన్డేలు అడిన నీవు ఎన్ని అర్థశతకాలు చేశావు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వన్టేలలో 16 పరుగుల అత్యధిక స్కోరు కల్గిన నీవు.. ప్రపంచ కప్ లో అడాలని ఎలా అనుకుంటున్నావు అని నిలదీస్తున్నారు. ఇలాంటి నీవు ధోని స్థానాన్ని అక్రమించాలని చూస్తావా..? అంటూ అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధోనికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కామెంట్లు చేస్తే సహించమని అభిమానులు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wriddhiman Saha  world cup  MS Dhoni  bcci  cricket  

Other Articles