Records Tumble as Kohli Leads in Only T20I రికార్డుల మోత మోగించిన విరాటుడు..

Records tumble as virat kohli leads from the front in only t20i

India vs sri lanka, Team India, Record tour win, virat kohli, manish pandey, india cricket team, ravi shastri, sl vs ind, ravi shastri, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

India skipper Virat Kohli just doesn’t tire when chasing down totals and once again produced a sensational innings to help India to a 7 wicket win in the only T20I against Sri Lanka at the R. Premadasa Stadium in Colombo.

రికార్డుల మోత మోగించిన విరాటుడు..

Posted: 09/07/2017 04:07 PM IST
Records tumble as virat kohli leads from the front in only t20i

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ముద్దుగా పరుగుల యంత్రంగా కూడా పిలుచుకుంటారు అభిమానులు. ఆయన సగటు చూస్తే అలా ఎందుకు పిలుచుకుంటారో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా శ్రీలంక పర్యటనలో చిట్టచివరిగా అడిన ఏకైక టీ20 మ్యాచులో కష్టాల్లో వున్న టీమిండియాను తనదైన కెప్టెన్ ఇన్నింగ్స్ తో విరాట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే దీంతో అయన ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు.

ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాటుడు తాజాగా మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 15 వేల పరుగులను పూర్తి చేసిన క్రికెటర్ గా రికార్డును నమోదు చేసుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో కలిసి కోహ్లీ 15వేలకు పైగా పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 33వ ఆటగాడు కోహ్లీ. అయితే అవరేజ్ గా ప్రతీ మ్యాచులో 50 పరుగులకు పైగా సాధించిన అటగాడిగా కోహ్లీ తప్ప మరెవర్వూ క్రికెట్ కెరీర్ లోనే లేకపోవడం గమనార్హం.

ఇప్పటి వరకు 60 టెస్టుల్లో 4,658 పరుగులు, 194 వన్డేల్లో 8,587 పరుగులు, 50 టీ20ల్లో 1,830 పరుగులు సాధించిన కోహ్లీ.. 15 వేల 75 పరుగులను వ్యక్తిగతంగా సాధించాడు. దీంతో పాటు పోట్టి క్రికెట్ ఫార్మెట్ లో (టీ20) అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మూడో స్థానంలో కోనసాగుతున్న కోహ్లీ త్వరలోనే 1889 పరుగులతో రెండోస్థానంలో కోనసాగుతన్న తిలకరత్నే దిల్షాన్ ను ఓవర్ టేక్ చేయనున్నాడు. ఆ తరువాత తొలిస్థానంలో కొనసాగుతున్న బ్రెండన్‌ మెక్ కలమ్ ‌(2,140)ను కూడా అధిగమిస్తే కానీ కోహ్లీ అగ్రస్థానానికి చేరుకోలేడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles