India Clean Sweep Sri Lanka Tour పరాయిగడ్డపై టూర్ స్వీప్ చేసిన టీమిండియా..

India clean sweep sri lanka win colombo t20 by 7 wickets

India vs sri lanka, Team India, Record tour win, virat kohli, manish pandey, india cricket team, ravi shastri, sl vs ind, ravi shastri, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

India won the match by 7 wickets completing a 3-0 whitewash in Tests, 5-0 sweep in ODIs and an easy 1-0 win in the one-off T20. This is the first time that an Indian cricket team registered an all-win record across

పరాయిగడ్డపై టూర్ స్వీప్ చేసిన టీమిండియా..

Posted: 09/07/2017 02:54 PM IST
India clean sweep sri lanka win colombo t20 by 7 wickets

శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. మునుపెన్నడూ లేని విధంగా పరాయిగడ్డపై పర్యటనలొ భాగంగా అడిన అన్ని మ్యాచులను టీమిండియా తన ఖాతాలో వేసుకుని.. అతిథ్యజట్టుకు తేరుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన విరాట్ సేన, ఐదు మ్యాచుల వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసి.. ఇటు టీ 20ని కూడా తన ఖాతాలో వేసుకుని రికార్డు విజయాన్ని అందుకుంది.

టీ20 మ్యాచులో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కెప్టెన్ ఇన్నింగ్స్ అడి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చే క్రమంలో పెవిలియన్ బాట పట్టాడు. కాగా కెప్టెన్ కు తోడుగా రాణించిన మనీష్ పాండే జట్టును ధీటుగా విజయంవైపు నడిపించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ నిర్ణయంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంకను.. భారత బౌలర్లు కట్టడి చేయడంలో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక కేవలం ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2, భువి, బుమ్రా తలో వికెట్ సాధించారు.

171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (9) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. లోకేశ్ రాహుల్‌ (24)తో కలిసి రెచ్చిపోయాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఈ క్రమంలో 82 పరుగుల వద్ద అవుటయ్యాడు. మనీష్ పాండే 36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు (నాటౌట్) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ మరో నాలుగు బంతులు ఉండగానే 174 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు రెండూ కెప్టెన్ కోహ్లీని వరించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles