Mike Hussey open to CSK coaching role విరాట్ కోహ్లీలో అ దిగ్గజ కెప్టెన్ పోలికలున్నాయా..?

Virat kohli s style of captaincy similar to ricky ponting s says mike hussey

virat kohli, kohli, india vs sri lanka, ind vs sl, mike hussey, ricky ponting, ind vs aus, india vs australia, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Michael Hussey feels that Team India's confidence will be really high after whitewashing Sri Lanka 3-0 in the Test series, but an ODI series against Australia would produce a different challenge for the hosts

విరాట్ కోహ్లీలో అ దిగ్గజ కెప్టెన్ పోలికలున్నాయా..?

Posted: 08/16/2017 07:48 PM IST
Virat kohli s style of captaincy similar to ricky ponting s says mike hussey

తన అద్భుత అటతీరు, గ్రౌండ్ లో సహచరులతో వ్యవహరిస్తున్న తీరుతో క్రికెట్ ప్రపంచంలోనే తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. 85 ఏళ్ల టీమిండియా క్రికెట్ చరిత్రలో సాధించని రికార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇక అయన అభిమానులను విరాట్ ను అకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ కోవాలో పలువురు క్రికెట్ దిగ్గజాలు కూడా వున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు మైకెల్‌ హస్సి కూడా చేరిపోయాడు.

‘టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆయన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ తో పోల్చాడు. మైదానంలో అతని నాయకత్వ లక్షణాలకు ముగ్ధుడైన హస్సి..  కోహ్లి నాయకత్వ శైలి రికీ పాంటింగ్‌కు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. కోహ్లి అద్భుతమైన ఆటగాడు. ఆయన కెప్టెన్సీ నిర్వహించే విధానం నాకు నచ్చుతుంది. మైదానంలో అతని దుందుడుకు స్వభావం, హావభావాలు, గెలవాలన్న తపన నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. జట్టును వీలైనంత ముందుకు నడపడానికి కోహ్లీ ప్రయత్నిస్తాడు. శిక్షణలో, ఆటలో నాణ్యత పాటించడంలో అతనికి అతనే సాటి. మ్యాచ్ గెలవాలన్న తపన, పోటీతత్వం లాంటి లక్షణాలు పాంటింగ్‌ను గుర్తుతెస్తాయి’ అని హస్సి అన్నారు.

మరోసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చాలా ఉత్తేజంగా ఉందని అన్నారు. జట్టుతో తనకు చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. రెండు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది కాబట్టి జట్టుకు ఇది సవాల్‌ లాంటిదే అని అన్నారు. ఈ జట్టుకు కోచ్ గా పనిచేసేందుకు ఆసక్తి ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india vs sri lanka  mike hussey  ricky ponting  india vs australia  cricket  

Other Articles