Saha walking into MS Dhoni's shoes: Ravi Shastri రవిశాస్త్రీపై ధోని అభిమానులు ఫైర్..

No 1 wicket keeper in the world wriddhiman saha walking into ms dhoni s shoes ravi shastri

ravi shastri, head coach, wriddhiman saha, mahendra singh dhoni, india cricket team, Virat Kohli, India vs Sri Lanka, sl vs ind, sourav ganguly, cricket news, sports news, sports, cricket

wriddhiman saha has done phenomenally well to grow out of MS Dhoni shadow. The kind of 'keeping he came up with in this series - on the kind of surfaces that were on offer - makes him the No. 1 wicket-keeper in the world right now says coach ravi shastri

రవిశాస్త్రీపై ధోని అభిమానులు ఫైర్..

Posted: 08/16/2017 01:05 PM IST
No 1 wicket keeper in the world wriddhiman saha walking into ms dhoni s shoes ravi shastri

టీమిండియా కోచ్ రవిశాస్త్రీ.. తన జట్టులోని సభ్యులకు ఉత్తమంగా తీర్చిదిద్దతూ.. ప్రపంచ కప్ కు సన్నధం చేస్తున్న వేళ.. శాంతియుతంగా, సౌమ్యంగా, విమర్శలకు దూరంగా వుంటూ తన పని తాను చేసుకోవాల్సి వుండగా, నిత్యం వివాదాల్లోనే మునిగితేలుతూ.. అలాంటి వ్యాఖ్యలే చేస్తూ నలుగురిలో నవ్వులపాలవుతున్నాడు. ఇటీవల మహాదిగ్గజాల వల్ల సాథ్యం కాని రికార్డులను విరాట్ సేన అందుకుందని వ్యాఖ్యనించి.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నుంచి చురకలను అంటించుకన్న రవిశాస్త్రీ.. తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. మరో టీమిండియా మాజీ కెప్టెన్ అభిమనుల నుంచి విమర్శలను ఎదుర్కోంటున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని తక్కువ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయనను ధోని అభిమానులు ఇప్పుడు నెట్ లో తూర్పారబడుతున్నారు, ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాయేనని ఆయన తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ప్రపంచ కప్ కు జట్టును సిద్ధం చేయడంపై రవిశాస్త్రిని మీడియా ప్రశ్నించగా, కీపింగ్ విషయానికి వచ్చేసరికి సాహా, అద్భుతంగా ఎదిగిపోయాడని, ఆయనకు మరెవరూ సాటి రారని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.

సాహా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పారు. ఇటు వికెట్ కీపింగ్ తో పాటు అటు బ్యాటింగ్, క్యాచింగ్ విభాగాల్లో సాహా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని, ఇప్పటికే ధోనీ స్థానాన్ని ఆక్రమించేశాడంటూ రవిశాస్త్రీ చేసిన వ్యాఖ్యలు మాజీ కెప్టెన్ అభిమానులకు అగ్రహాన్ని తెప్పించింది. ధోనీ నీడలో ఎదుగుతూ వచ్చిన సాహా, ఆయన్నే మించిపోయాడని కితాబివ్వడం మరింత అగ్గికి అజ్యం పోసినట్లైంది. దీంతో ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా, ఆయనపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles