Hardik Pandya credits MS Dhoni తొలి టెస్టులో సెంచరీ క్రెడిట్ ధోనీదేనట..

Hardik pandya credits ms dhoni for teaching him to be selfless for the team

sri lanka vs india, india cricket team, hardik pandya, ms dhoni, malinda pushpakumara, hardik_pandya, ms_dhoni, malinda_pushpakumara, india_cricket_team, sri_lanka_vs_india, default, cricket, cricket news, cricket, sports news, latest news

Indian all-rounder Hardik Pandya has credited former Indian skipper MS Dhoni for teaching him the importance of being selfless for the team which also helped him remain calm at the crease.

తొలి టెస్టులో సెంచరీ క్రెడిట్ ధోనీదేనట..

Posted: 08/14/2017 07:14 PM IST
Hardik pandya credits ms dhoni for teaching him to be selfless for the team

టెస్టు మ్యాచ్ అరంగ్రేటంలోనే శతకం సాధించి బెస్ట్ అల్ రౌండర్ గా అందరి ప్రశంసలు అందుకున్న హార్థిక్ పాండ్య.. తన శతకం సాధించిన క్రెడిట్ ను మాత్ర టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికే అందించాడు. అందుకు కారణాన్ని కూడా చెప్పాడు. శ్రీలంక సిరీస్ తో టెస్టు అరంగ్రేటం చేసిన పాండ్య తొలి శతకం సాధించే క్రమంలో.. లక్ష్యానికి చేరువైతున్న కొద్ది సహజంగా ఏ బ్యాట్స్ మెనైనా ఒత్తడికి గురవుతాడని, అయితే తాను మాత్రం 90 పరుగులు దాటిన తరువాత కూడా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వలేదని చెప్పాడు పాండ్య.

అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహాలేనని చెప్పుకోచ్చాడు ఈ యువ అల్ రౌండర్. మూడో టెస్టులో పాండ్యా 96 బంతుల్లో 108 పరుగులు చేశాడు. తాను ప్రశాంతంగా ఉండేందుకు ధోనీ సలహాలు ఉపయోగపడ్డాయన్నాడు. తన జీవితంలో తొలిసారి 90 పరుగుల వద్ద ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని అన్నారు. అందుకు ధోని సలహాలు దోహదపడ్డాయని అన్నాడు. అయితే తాను గతంలో చేసిన సెంచరీలు తనకు గుర్తులేవని కూడా అన్నాడు.

క్రీజులోకి వెళ్లిన తరువాత తాను భిన్నమైన మనస్తత్వంతో ఉంటానని,. వ్యక్తిగత పరుగులు, గుర్తింపు కోసం ఆరాటపడను. జట్టును ఎప్పుడూ మెరుగైన స్థితిలో ఉంచాలన్నదే తన తపన అని చెప్పాడు. తమ జట్టును ఎప్పుడూ పైచేయి దిశగా వుంచాలన్నదే తన తపన అని అది.. మహి భాయ్‌ (మహేంద్ర సింగ్ ధోని) నుంచి నేర్చుకున్నానని చెప్పాడు. స్కోర్‌బోర్డు చూసి పరిస్థితికి తగ్గట్టు ఆడాలని ధోనీ సూచించాడు. ఇప్పుడు తనకు అదే ఉపయోగపడుతోందని పాండ్యా చెప్పాడు. అయితే కపిల్ దేవ్ రికార్డుల్లో పది శాతం సాధించినా తన జీవితాంతం అనందంగా గడిపేస్తానని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles