Mithali Raj eyes next T20 World Cup క్రికెట్ పట్ల అదరణ పెరగడం స్వాగతించాల్సిందే..

Mithali raj says fortunate to be from hyderabad eyes next t20 world cup

ICC Women's World Cup 2017, india, Harmanpreet kaur, mithali Raj, mandana, deepti sharma, Sri lanka, India Women's Cricket Team, points table, women's world cup points table, cricket news, cricket, sports news, latest news

The Indian women's cricket team captain Mithali Raj is not disheartened by the loss in the recently concluded ICC Women's World Cup final and is eyeing the next T20 World Cup

క్రికెట్ పట్ల అదరణ పెరగడం స్వాగతించాల్సిందే..

Posted: 08/02/2017 07:34 PM IST
Mithali raj says fortunate to be from hyderabad eyes next t20 world cup

మహిళా వన్డే ప్రపంచకప్ తరువాత మహిళా క్రికెట్ పట్ల ఆదరణ పెరగడం చాలా సంతోషాన్ని ఇస్తుందని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఇదొక శుభ పరిణామంగా ఆమె అభివర్ణించారు. ఇక దేశీయంగా మహిళా క్రికెట్ కు కూడా పోటీ పెరుగుతుందని, దీంతో మరింత యువ క్రీడాకారుణిలు తెరపైకి వస్తారని అశాభావం వ్యక్తం చేసింది. భారతీయ అమ్మాయిలకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందునే ప్రపంచ కప్ లో కలసికట్టుగా రాణించి.. ప్రపంచ క్రికెట్ అభిమానులందరినీ ఆకట్టుకున్నామని మిథాలీ అన్నారు. అదే సమయంలో మహిళా క్రికెట్ కు ఆదరణ కూడా పెరగడం శుభసూచకమన్నారు.

హైదరాబాద్ నుంచి అధిక స్థాయిలో క్రీడాకారులు తయారు కావడానికి కారణం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహమేనన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహించడం ఆయా క్రీడాకారుiలు తమ అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానిదేనన్నారు. మనదేశంలో క్రీడాకారులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుండటం దురదృష్టకరమన్నారు. ఇక్కడ క్రీడాకారులు భారీ విజయాలను అందుకున్న తరువాతే వారిని గుర్తింపు లభిస్తుందని అన్నారు. అదే విదేశాల్లో అయితే యుక్త వయసు నుంచి క్రీడాకారుల పట్ల శ్రద్ధ చూపెట్టి, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles