Ashwin beats Herath in ICC latest rankings ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ ప్లేస్ పధిలం..

Jadeja ashwin make it 1 2 for india in icc rankings

rankings, ravindra jadeja, virat kohli, icc rankings list, icc rankings virat kohli, icc rankings jadeja, sir jadeja, virat kohli ranking, what is virat kohli ranking, what is ravindra jadeja ranking, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Ravindra Jadeja and Ravichandran Ashwin held the top two spots in the latest ICC rankings for bowlers while Shikhar Dhawan and Ben Stokes made big strides

ఎగబాకిన మనోళ్లు.. తొలిరెండు స్థానాల్లో జెడేజా, అశ్విన్..

Posted: 08/01/2017 09:01 PM IST
Jadeja ashwin make it 1 2 for india in icc rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత స్పీన్ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ తిరిగి తన రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 190, రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులు సాధించిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 39వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. గతంలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో శ్రీలంక ఆటగాడు రంగన హెరాత్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లు ధావన్‌, షమి తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఇటీవల గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రాణించిన టీమిండియా క్రికెటర్లు అదేస్థాయిలో క్రమంగా తమ ర్యాంకులను  మెరుగుపర్చుకున్నారు. ఈ టెస్టులో అశ్విన్‌ నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకోగా హెరాత్‌కు కేవలం ఒక వికెట్‌ మాత్రమే దక్కింది. దీంతో తాజా ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో హెరాత్‌ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ తీసిన హెరాత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు.

టెస్టు జట్టు ర్యాంకులలో 123 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా(117), ఆస్ట్రేలియా(100), ఇంగ్లాండ్‌(99), న్యూజిలాండ్‌(97) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. బ్యాట్స్ మెన్‌ జాబితాలో స్మిత్ ‌(941), రూట్ ‌(885), విలియమ్సన్‌ (880), పుజారా (866), కోహ్లీ (826) టాప్‌-5లో కొనసాగుతున్నారు. లంకతో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు చేసిన ధావన్‌ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 39వ స్థానాన్ని దక్కించుకున్నాడు. షమి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 23వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచారు. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్‌.. రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Ravindra Jadeja  Ravichandran Ashwin  shikar dhawan  ben stokes  cricket  

Other Articles