Mithali, Goswami donate their signed match jerseys లండన్ క్రికెట్ మ్యూజియంలో వారిద్దరి జెర్సీలు

Mithali raj jhulan goswami donate their signed match jerseys to lord s museum

ICC Women's World Cup 2017, India vs england, WWC finals, india, england, Mithali Raj, Jhulan Goswami, match-worn jerseys, Lord’s museum, India Women's Cricket Team, cricket news, cricket, sports news, latest news

Mithali Raj and Jhulan Goswami donated their match-worn jerseys to the Lord’s museum before departing from England.

లండన్ క్రికెట్ మ్యూజియంలో వారిద్దరి జెర్సీలు

Posted: 07/26/2017 07:35 PM IST
Mithali raj jhulan goswami donate their signed match jerseys to lord s museum

అద్భుత ప్రదర్శనతో మహిళా వరల్డ్‌ కప్‌ రన్నరప్ గా నిలిచిన టీమిండియా మహిళా క్రికెట్ క్రీడాకారులలో సారధి మిథాలీ రాజ్ తో పాటు పేస్ బౌలర్ జులన్ గోస్వామిలకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరికీ చెందిన టీమిండియా జెర్సీలకు లండన్ లోని హోమ్ అఫ్ క్రికెట్ మ్యూజియంలో స్థానం దక్కించుకున్నాయి. ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైన ఈ మ్యూజియంలో పలువురు క్రికెట్ దిగ్గజాలకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు ఇందులో ఇప్పటికే కొలువుదీరాయి. తాజాగా వాటన్నింటి సరసన మిథాలీ, గోస్వామీ జెర్సీలకు కూడా స్తానం లభించింది.

తాజాగా మిథాలీ, జులన్ గోస్వామిలు ప్రపంచకప్ టోర్నీలో ధరించిన జెర్సీలపై సంతకాలు చేసి హోమ్ ఆఫ్ క్రికెట్ మ్యూజియానికి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను క్రికెట్ ప్రపంచకప్ నిర్వాహకులు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. లార్డ్స్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ లో తలపడిన భారత్‌ 9 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గోస్వామి అద్భుత ప్రదర్శన చేసింది. మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును 228 పరుగులకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీరాజ్ జెర్సీలను తీసుకున్న మ్యూజియం అధికారులు వాటిని ప్రధర్శన కోసం ఉంచనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Women's World Cup 2017  mithali raj  match-worn jerseys  Lord’s museum  cricket  

Other Articles