no one expected we enter final in WWC; julan goswami ఎవరూ ఉహించని విధంగా దూసుకెళ్లాం..

No one expected we enter final in wwc julan goswami

ICC Women's World Cup 2017, India vs England, ICC WWC final, india, england, jhulan goswami, mithali raj, womens cricket, Harmanpreet kaur, smriti mandana, deepti sharma, India Women's Cricket Team, cricket news, cricket, sports news, latest news

A word about “captain cool” Mithali Raj who took care to retain her composure in defeat and didn’t pin the blame on the players’ performance for the defeat.

ఎవరూ ఉహించని విధంగా దూసుకెళ్లాం..

Posted: 07/25/2017 06:34 PM IST
No one expected we enter final in wwc julan goswami

అద్భుత ప్రదర్శనతో మహిళా వరల్డ్‌ కప్‌ ఫైనల్ వరకు వెళ్లి.. తుదిపోరులో అతిథ్య జట్టు ఇంగ్లాండ్ చేతిలో కేవలం 9 పరుగులతో ఓటమిని చవిచూసి నిరాశపర్చినా.. ఇకపై రానున్న టోర్నీలలో మరింత మెరుగ్గా రాణించగల సత్తా టీమిండియా మహిళా జట్టుకు వుందని జట్టు ఫేస్ బౌలర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. ఐసీసీ మహిళా ప్రపంచ కప్ టోర్నోమెంటును ప్రకటించిన నేపథ్యంలో తమ జట్టుపై ఎవరికీ ఎలాంటి అంచాలా లేవని, అయితే జట్టుగా తాము మాత్రం కనీసం సెమీ ఫైనల్స్ కు చేరాలన్న పటిమతోనే అడామని అమె తెలిపారు.

టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మా జట్టు ఫైనల్ వరకు చేరుకోగలుగుతుందని ఎవరూ ఊహించలేదని.. అలాంటి ఫైనల్స్ వరకు చేరుకోవడం ఒకింత సంతోషంగానే వుందని అమె అన్నారు. అయితే ఇందుకు కారణం మాత్రం టోర్నీలోని తొలి మ్యాచ్ అని అమె అన్నారు. తొలి మ్యాచ్ లో అతిథ్యజట్టు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించడంతో తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. జట్టుగా సమిష్టిగా పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందని మేం భావించామని.. ఈ ప్రయాణాన్ని మేం అస్వాదిస్తున్నామని చెప్పారు. ఒక్క ఫైనల్ మ్యాచ్ తప్ప.. టోర్నీ మొత్తంగా తమ ఆట గర్వించే స్థాయిలో వుందని గోప్వామి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles