Gambhir bats for kumble, blasts BCCI కుంబ్లేకు పరాభవంతో బిసిసిఐ గౌరవం పోయింది..

A legend like anil kumble deserved more respect from bcci gautam gambhir

Gautam Gambhir, Anil Kumble, Team India, head coach, virat kohli, Ravi Shastri, bcci, respect to legend, respect to former captain, bharat arun, zaheer khan, rahul dravid, ms dhoni, cricket news, sports news, sports latest sports news, cricket

BCCI could have handled it in a lot more professional way. You got to give a legend like Anil Kumble a lot more respect. He is someone who has done so much for Indian cricket and has been a captain as well.

కుంబ్లేకు పరాభవంతో బిసిసిఐ గౌరవం పోయింది..

Posted: 07/24/2017 06:12 PM IST
A legend like anil kumble deserved more respect from bcci gautam gambhir

టీమిండియా కోచ్ గా తన సత్తాను ఏడాది కాలంలోనే నిరూపించి.. భారత్ కు విజయాలను అందించిన అనీల్ కుంబ్లేను అవమానకర రీతిలో పంపిన బిసిసిఐ.. ఆయనకు సముచిత స్థానం కల్పించివుంటే బాగుండేదని టీమిండియా సీనియర్ అటగాడు గౌతమ్ గంబీర్ అన్నాడు. తన పదవిని పొడగిస్తామని నాన్చుడు ధోరణి అవలంభించి.. అసహనంతో తనకు తానుగా పదవికి కుంబ్లే గుడ్ బై చెప్పేలా చేసిన విధానం సరిగ్గా లేదని అన్నారు. కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి జట్టు సేవలకు అతడ్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా వినియోగంచుకుని వుంటే అతడి గౌరవాన్ని కాపాడిన వారయ్యేవారని అన్నాడు.

అనీల్ కుంబ్లే వ్యవహారంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతని గౌరవాన్ని కాపడంతో పాటు తన గౌరవాన్ని కూడా కాపాడుకుని వుండివుంటే బాగుండేదన్నాడు. భారత క్రికెట్ కు ఎంతో సేవ చేసిన ఒక దిగ్గజ ఆటగాడి వ్యవహారాన్ని బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదనే అభిప్రాయం సర్వాత్రా వినిపిస్తుందని అన్నాడు. జట్టు విజయాలలో అతని సేవలను వినియోగించుకుని.. ఆ తరువాత అతడ్ని వాడుకుని వదిలేసినట్లుగా వుందని.. అసలు కుంబ్లేను బిసిసిఐ పట్టించుకోలేదని అన్నాడు. బీసీసీఐ నుంచి తగినంత గౌరవం పొందే అర్హత అనీల్ కుంబ్లేకు ఉందన్నాడు.

'కోచ్ గా కుంబ్లే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది అనే దానిపై లోతైన విశ్లేషణ అనవసరం. ముందు అతనికి మరింత ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐది. ఒక క్రికెటర్ గా అతను ఎంతో చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతని వ్యవహారంలో బీసీసీఐ ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తే బాగుండేది. కుంబ్లేను గౌరవంగా సాగనంపడంలో బీసీసీఐ విఫలమైంది. ఈ తరహా విధానం బీసీసీఐ ప్రతిష్టను దెబ్బతీస్తుంది'అని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, కోచ్ ను ఎంపిక చేసి విషయంలో ఆటగాళ్ల పాత్ర అనవసరమన్నాడు. కోచ్ ఎంపిక అనేది క్రికెటర్ల ఉద్యోగం కాదని పేర్కొన్న గంభీర్.. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేస్తే మంచిదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Gautam Gambhir  virat kohli  bcci  cricket  

Other Articles