KL Rahul down with fever ahead of first Test శ్రీలంకతో తొలి టెస్టుకు రాహుల్ అనుమానమే..

India in sri lanka kl rahul out of galle test with viral fever

india vs sri lanka, galle test, virat kohli, MS Dhoni, kl rahul, rahul, colombo test, Indian cricket team, cricket news, Galle, Team India, BCCI, SL vs IND, sports news

KL Rahul will miss the first India vs Sri Lanka cricket Test starting in Galle on July 26. The Bangalore batsman is down with fever but is progressing well

శ్రీలంకతో తొలి టెస్టుకు రాహుల్ దూరం..

Posted: 07/24/2017 05:28 PM IST
India in sri lanka kl rahul out of galle test with viral fever

శ్రీలంకతో పూర్తిస్థాయిలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా మరో రెండు రోజుల్లో ఆరంభమయ్యే తొలి టెస్టుకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. ఈ బెంగళూరు యువ క్రికెటర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే జ్వరం నుంచి కొలుకుంటున్నా.. అతడ్ని గాలేలో జరిగే తొలి టెస్టులో అడటం మాత్రం కష్టమేనని బిసిసిఐ ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. జ్వరంతో బాధపడుతున్న కారణంగా రాహుల్.. కొలంబో నుంచి బయల్దేరిన జట్టు సభ్యులతో పాటు గాలేకు చేరుకోలేదని కూడా తెలిపింది.

జ్వరం కారణంగా రాహుల్ ఇవాళ ప్రాక్టీస్ సెషన్ ను సైతం మిస్సవుతున్నాడని బిసిసిఐ తెలిపింది. దీని కారణంగానే రాహుల్ తొలి టెస్టుకు దూరం కానున్నాడని బిసిసిఐ తెలిపింది. కాగా ఏప్రిల్ లో ఎడమ భుజానికి గాయం కావడం కారణంగా సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు మూడు నెలల పాటు జాతీయ జట్టుకు దూరమైన రాహుల్.. ఐపీఎల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ సిరీస్ ల నుంచి తప్పుకున్నాడు.

మూడు నెలల తరువాత తొలి కాంపిటేటివ్ మ్యాచ్ కు సిద్ధమైన రాహుల్.. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో గాలె వేదికగా జరగనున్న తొలి టెస్టులో శిఖర్ ధావన్ తో కలిసి అభినవ్ ముకుంద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాట్లు సమాచారం. అయితే అగస్టు 3 నుంచి కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టుకు రాహుల్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ అశాభావం వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KL Rahul  india  srilanka  viral fever  teamindia  cricket  

Other Articles