Harmanpreet's breezy ton propels India to WWC final వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన మిథాలీ సేన

Harmanpreet kaur s 171 helps india reach final beating defending champions

Women’s World Cup 2017, ICC Women’s World Cup 2017, Mithali Raj team enters WWC finals, australia, Team India, India women vs Australia women, Mithali Raj, Punam Raut, Smriti Mandhana, australia vs india, india vs england, ind vs eng, eng vs ind, Women’s cricket World Cup finals, cricket news, cricket, sports news, latest news

India defeated Australia by 36 runs to storm into the final of the ICC Women’s World Cup 2017 on the back of a stellar knock by Harmanpreet Kaur.

వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన టీమిండియా

Posted: 07/21/2017 12:47 AM IST
Harmanpreet kaur s 171 helps india reach final beating defending champions

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తన అద్భుత పోరాట పటిమను కొనసాగించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన సెమీ ఫైనల్స్ లో ఢిపెండింగ్ ఛాంపియన్స్ అస్ట్రేలియాపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఐసీసీ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు అసీస్ పై 36 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో రెండో పర్యాయం టీమిండియా మహిళల క్రికెట్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ భెర్త్ ను ఖాయం చేసుకోగా, ఆస్ట్రేలియాను మట్టికరిపించిన మిథాలీ సేన కూడా ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచులో భారత్‌ చిరస్మరణీయ విజయం అందుకుని అభిమానుల కలను నెరవేర్చింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన నిర్ణీత 42 ఓవర్లలో 281  పరుగులను సాధించింది. అదిలోనే రెండు కీలక వికెట్లను కొల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన హర్మన్ ఫ్రీత్ కౌర్ తన అద్బుత బ్యాటింగ్ తో సోర్కుబోర్డును పరుగులెత్తించింది.

115 బంతుల్లో 20 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 171 పరుగులతో అజేయంగా నిలిచింది. సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత మెరుపు వేగంతో పరుగులను రాబట్టింది. దీంతో టీమిండియా నిర్థేశించిన 282 పరుగుల విజయలక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ 3, జులన్‌ గోస్వామి, శికా పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. మిడిలార్డర్లో విలానీ(75) మ్యాచ్ చివర్లో బ్లాక్ వెల్ ‌(90) అద్బుతంగా రాణించి.. మ్యాచ్ పై గెలుపు ఎవరి వశం అవుతుందన్న ఉత్కంఠ రేపింది.

ఒక దశలో సహచర క్రికెటర్లు అవుటవుతున్నా.. బ్లాక్ వెల్ ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులను రాబట్టింది. అయినా మిథాలీ సేన సమిష్టిగా రాణించి అసీస్ ను కట్టడి చేసింది. 39వ ఓవర్లో దీప్తీ శర్మ వేసిన తొలి బంతికి బ్లాక్ వెల్ అవుటవ్వడంతో టీమిండియా శిబిరంలో సంతోషం వెల్లివిసిరింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో టీమ్ండిడియా గెలుపొందింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. ఇక ఈ నెల 23న లార్డ్స్ లో జరగనున్న ఫైనల్స్ లో మిథాలీ సేన ఇంగ్లాండ్ తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  australia  ind vs aus  Mithali Raj  semi final  icc womens world cup  cricket  

Other Articles