Shami's residence in Kolkata attacked షమీ ఇంటిపై దాడికి యత్నం, 3 అరెస్టు

Cricketer mohammed shami attacked outside home over parking 3 arrested

mohammed shami, mohammed shami ahmed, indian pacer, altercation, road rage, kolkata, india, cricket, cricket news, sports, sports news, latest news

The Jadavpur police in South Kolkata on Monday made three arrests after star India pacer Mohammed Shami filed a complaint about manhandling of his apartment's caretaker.

షమీ ఇంటిపై దాడికి యత్నం, 3 అరెస్టు

Posted: 07/18/2017 04:24 PM IST
Cricketer mohammed shami attacked outside home over parking 3 arrested

టీమిండియా ఫేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంటిపై స్థానికులైన కొందరు అగంతకులు దాడికి యత్నించారు. షమీ భార్య అగంతకులు అరుపులను గమనించి సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి ముగ్గురు అగంతకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో షమీ ఇంట్లో చోరబాటుకు కూడా యత్నించారు. కోల్ కతాలోని కట్టూనగర్ లో ఆయన నివాసం వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే, శనివారం రాత్రి షమీ తన భార్యతో కలసి షాఫింగ్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న షమీ కారు.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొనింది. దీంతో షమీ కారు డ్రైవర్ తో ద్విచక్రవాహనదారుడు ఘర్షణకు దిగాడు.

దీంతో గోడవ ముదరకుండానే కారు దిగిన షమీ.. తన డ్రైవర్ తో పాటు ద్విచక్ర వాహనదారుడ్ని సముదాయించి నచ్చజెప్పి పంపించాడు. ఆనంతరం షమీ తన భార్యతో పాటుగా ఇంటికి చేరకున్నాడు. షమీ ఇంట్లో రీఫ్రెష్ అవుతుండగా, అతని ఇంటిపైకి ద్విచక్ర వాహనదారుడితో పాటు మరికోందరు అతని తరపున వచ్చి ఇంట్లోకి చోరబడేందుకు యత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై చేయిచేసుకున్నారు. అంతటితో అగకుండా ఇంట్లోకి వస్తుండగా, గమనించిన షమీ భార్య వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు షమీ ఇంటిపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఏకంగా ఇంటిపైకి వెళ్లి మరీ దాడులకు యత్నించిన నేపథ్యంలో ముగ్గురు యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులైన యువకులను న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. షమీ భార్య పిర్యాదు చేయడంతోనే ఈ కేసు వివరాలు బయటకి వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohammed shami  mohammed shami ahmed  indian pacer  altercation  road rage  kolkata  india  cricket  

Other Articles