శ్రీలంక మాజీ దిగ్గజ అటగాడు, కెప్టెన్ అర్జున రణతుంగా పేల్చిన బాంబుకు టీమిండియా క్రకిెటర్లు ధీటుగా సమాధానమిస్తున్నారు. 2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆయన సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీమిండియాకు చెందిన ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్.. రణతుంగా తాను చేసిన అరోపణలకు కట్టుబడి వుండాలని సూచించారు. అయితే అరోపణలకు తగ్గ అధారాలను కూడా ఆయన సేకరించుకుని వాటిని కూడా చూపాలని గంభీర్ పేర్కోన్నారు.
2011 ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను షాక్ కు గురి చేసిందని రణతుంగ అన్నారు. అప్పుడు కామెంటేటర్ గా తాను భారత్ లోని ముంబై నగరంలో వున్న వాంఖేడ్ స్టేడియంలోనే ఉన్నానని చెప్పారు. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి టీమిండియాకు 275 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్... అదిలోనే సెహ్వాగ్, సచిన్ వికెట్లను కోల్పోయిందని చెప్పాడు. అప్పటివరకు పటిష్టస్థితిలో వున్న లంక.. అనూహ్యంగా మ్యాచ్ స్వరూపం మారిపోయి ఓటమిపాలవ్వడం తానను షాక్ కు గురిచేసిందని అన్నాడు.
శ్రీలంక బౌలింగ్, ఫీల్డింగ్ రెండూ పేలవంగా మారిపోయాయని... దీంతో, భారత్ విజేతగా నిలిచిందని చెప్పాడు. ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆటతీరుపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నాడు. మరోవైపు, రణతుంగ వ్యాఖ్యలను అప్పటి భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు ఖండించారు. రణతుంగ ఆరోపణలు తమను ఆశ్చర్యపరిచాయని, ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, చూపించాలని అన్నారు. రణతుంగ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫైనల్స్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Apr 16 | రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ స్వభావాన్ని తాము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచులో... Read more
Apr 13 | క్రికెట్ లో బ్యాట్స్ మెన్లకు లేక ఫీల్డర్లకు బంతులు తగలడం అన్నది సర్వసాధారణం. అయితే కొద్దికాలం క్రితం వరకు తాము సేప్ అనుకున్న అంఫైర్లకు కూడా ఇప్పుడు గాయాలు తగులుతున్నాయి. దీంతో అంఫ్లైర్లు కొన్ని... Read more
Apr 13 | హైదారబాద్ వేదికగా సాగిన రెండో మ్యాచులో రమారమి విజయపుటంచుల వరకు చేరని ముంబై ఇండియన్స్ జట్టు చిట్టచివరి బంతి ముందు బోర్లాపడటం తనను తీవ్రంగా కలచివేస్తోందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ... Read more
Apr 11 | చెన్నై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను జరగబోనివ్వమని నామ్ తమిజార్ కట్చి నేతలు, నిర్వహకులను హెచ్చరించిన నేపథ్యంలో.. దీనిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. చెన్నై వేదకను రద్దు... Read more
Apr 09 | కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో తమ ఓటమికి కారణం ఏంటో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పేశాడు. 176 పరుగుల భారీ స్కోరు చేసినా సరిపోలేదని, మరో... Read more