COA wants Kapil Dev as part of Steering Committee ఆ కమిటీలో కపిల్ దేవ్ కు కీలక బాధ్యతలు.?

Coa wants kapil dev as part of steering committee for players association

BCCI, Committee of Administrators, four-member steering committee, Kapil Dev, Ramachandra Guha, Players' Association​, Mohinder Amarnath, Lodha panel, GK Pillai, Anshuman Gaekwad India, bharath reddy, cricket news, sports news, spots, cricket

The Committee of Administrators (COA) has recommended former India captain Kapil Dev's name as a part of the four-member steering committee

ఆ కమిటీలో కపిల్ దేవ్ కు కీలక బాధ్యతలు.?

Posted: 07/12/2017 09:52 PM IST
Coa wants kapil dev as part of steering committee for players association

బీసీసీఐలో అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ఆటగాళ్ల సంఘాన్ని ఏర్పాటు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమిటీ నియమించిన లోథా కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో దానిని అమలు చేసేందుకు ఏర్పాటవుతున్న కమిటీలో కపిల్ దేవ్ కు కీలక బాధ్యతలు అప్పగించారా..? అంటే అవునన్న సంకేతాలు వెలువుడుతున్నాయి. లోధా కమిటీ సిఫార్సులను అమల్లోకి తెచ్చేందుకు నలుగురు సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఇకపై కపిల్ దేవ్ కు కీలక బాద్యతలు అందనున్నాయన్న సమాచారం.

ఈ నేపథ్యంలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు సమర్పించిన తన నివేదికలో నలుగురు సభ్యుల స్టీరింగ్‌ కమిటీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మాజీ టెస్టు ఓపెనర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌, మాజీ క్రికెటర్‌ భరత్‌ రెడ్డి, జీకై పిళ్లై పేర్లను ఈ కమిటీ సభ్యులుగా సూచించింది. ఇటీవల ట్విటర్‌లో కపిల్‌దేవ్‌ తాను క్రికెటర్ల సంఘంలో భాగం కాబోతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, కపిల్‌ ప్రస్తుతం వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా, పలు టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయన తన బిజీ షెడ్యూల్‌లో సమయం ఎలా కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక అన్షుమన్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన భరత్‌రెడ్డి 1979లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టులో కీపర్‌గా వ్యవహరించారు. మరోవైపు పరిపాలకుల కమిటీలో రామచంద్ర గుహ, విక్రమ్‌ లిమ్హే స్థానాలను భర్తీ చేయాలని కమిటీ తన నివేదికలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు విన్నవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles