kohli surpasses sachin record in chasing centuries సచిన్ రికార్డును అధిగమించిన కోహ్లీ..

Chase master virat kohli breaks yet another sachin record

India vs West Indies 2017, Virat Kohli, chasing centuries record, kohli surpasses sachin tendulkar, virat surpasses sachin record, odi, sachin tendulkar, ton, cricket news, sports news, sports, cricket

Virat Kohli's masterly 111 helped India clinch the one day series against West Indies and this was Virat's 28th in One Day cricket, and out of these 28, 18 have come while chasing.

సచిన్ రికార్డును అధిగమించిన కోహ్లీ..

Posted: 07/07/2017 07:15 PM IST
Chase master virat kohli breaks yet another sachin record

వెస్టిండీస్ పై ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తేడాతో దక్కించుకోగా, చివరి మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అజేయ సెంచరీతో వన్డేల్లో 28వ శతకం నమోదు చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. వన్డేల్లో ఇప్పటి వరకు మొత్తం 28 శతకాలు సాధించిన కోహ్లీ 18 శతకాలను లక్ష్య ఛేదనలో సాధించడం గమనార్హం. గతంలో ఛేదనలో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా సచిన్ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు కోహ్లీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సచిన్‌ తన కెరీర్లో 17 శతకాలను 232 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా... కోహ్లీ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే 18 శతకాలు నమోదు చేశాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌ వంటి ఆటగాళ్లు దొరకడం సంతోషకరమన్నాడు. జట్టు లోయర్ ఆర్డర్లో వారు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. తొమ్మిదో ర్యాంకు విండీస్ పై ఎలాంటి ప్రయోగాలు చేయని కోహ్లీ 3-1తో వన్డే సిరీస్ నెగ్గిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఏ సిరీస్ నూ తేలిగ్గా తీసుకోలేమని అన్నాడు. అలాగే హార్దిక్‌, కేదార్ ను 3, 4 స్థానాల్లో ఆడించలేమని చెప్పాడు. హార్దిక్‌, కేదార్ లు సత్తా నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారని అన్నాడు. వీరిద్దరి సామర్థ్యంపై పూర్తి విశ్వాసముందని.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ దొరకడం సంతోషమని కోహ్లీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles