Coach selection a Three-Horse race రవిశాస్త్రీకి కోచ్ పదవి నల్లేరుపై నడక కాదా..?

Coach selection a three horse race with ravi shastri virender sehwag tom moody

anil kumble, coach anil kumble, ravi shastri, sunil gavaskar, tom moody, virender sehwag, india cricket coach, sourav ganguly, sunil gavaskar, sachin tendulkar, sourav ganguly, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

The race for Team India's next Head Coach is getting intense day-by-day with the BCCI and CAC eagerly waiting for the July 9 application day deadline to pass

రవిశాస్త్రీకి కోచ్ పదవి నల్లేరుపై నడక కాదా..?

Posted: 07/05/2017 07:23 PM IST
Coach selection a three horse race with ravi shastri virender sehwag tom moody

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రికి రమారమి దక్కే అవకాశాలున్నాయని వార్తలు అందుతున్నా అది ఆయనకు నల్లేరుపై నడక కాదని కూడా వాదనలను వినిపిస్తున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, ఫిల్‌ సిమన్స్‌, రిచర్డ్‌ ఫైబస్‌, దొడ్డా గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ కూడా కోచ్‌ పదవికి రేసులో నిలిచారు. తాజాగా భారత జట్టు మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌... కోచ్‌ పదవి రవిశాస్త్రికే దక్కే అవకాశాలున్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే రవిశాస్త్రితో సమానంగావిదేశీ కోచ్ కు కూడా అవకవాశాలు మెండుగానే వున్నాయని అందుకు వారి ట్రాక్ రికార్డే కారణమని తెలుస్తుంది.

ఎందుకంటే.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకి కోచ్‌గా బాధ్యతలు అందించాడు టామ్‌ మూడీ. అతను శ్రీలంక జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా ఏళ్లు కొనసాగిన టామ్‌ మూడీకి అపారమైన అనుభవం ఉంది. ఐపీఎల్‌ ద్వారా భారత ఆటగాళ్లను అతను ప్రత్యక్షంగా గమనించిన అనుభవం కూడా ఉంది. అతను ఈ పదవికి పూర్తి అర్హుడు అని వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత పోటీ విండీస్‌కి చెందిన ఫిల్‌ సిమన్స్‌ నుంచి. విండీస్‌ జట్టు టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో ఫిల్‌ కీలకపాత్ర పోషించాడు. జింబాబ్వే, ఐర్లాండ్‌ జట్లకు అతను కోచ్‌ బాధ్యతలు అందించిన అనుభవం ఉంది. సిమన్స్‌ ఆధ్వర్యంలో ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పోటీదారుడు దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్‌ పైబస్‌. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లకు పైబస్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు డొమిస్టిక్‌ సర్క్యూట్‌లోని జట్లకు పైబస్‌ పని చేశాడు. అతని హయాంలో జట్లు కీలక విజయాలు సాధించాయి. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో పైబస్‌కు తనదైన ప్రత్యేకత ఉంది. దీంతో రవిశాస్త్రికి విదేశీ కోచ్‌ల నుంచి పోటీ తీవ్రంగానే ఉండవచ్చని అంటున్నారు. భారత జట్టు సారథి కోహ్లీ.. రవిశాస్త్రికి తన మద్దతిచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు బీసీసీఐ జులై 9 వరకు గడువు ఇచ్చింది. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా మండలి జులై 10న దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్‌ ఎవరో తేల్చనుంది. స్వదేశీయులకే కోచ్‌ పదవిని కట్టబెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. మరి చివరికి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  icc champions trophy  anil kumble  ravi shastri  sunil gavaskar  tom moody  bcci  cricket  

Other Articles