Venkatesh Prasad joins fray for Team India coach టీమిండియా కోచ్ రేసులో మరో సీనియర్

Venkatesh prasad joins fray for team india coach

anil kumble, coach anil kumble, virender sehwag, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, Venkatesh Prasad, Indian cricket team, Anil Kumble, BCCI, Ravi Shastri, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Venkatesh Prasad, who had earlier worked with the Indian cricket team as the bowling coach, has applied for the post of head coach following the resignation of Anil Kumble

టీమిండియా కోచ్ రేసులో మరో సీనియర్

Posted: 06/29/2017 06:46 PM IST
Venkatesh prasad joins fray for team india coach

టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో అతడి సేవలను కొనసాగించాలని భావించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు తీవ్ర అసహనంతో వున్నడాని గ్రహించి ఎటు తేల్చుకోలేని బిసిసిఐ పరిస్థితిని గమనించిన కుంబ్లే తనకు తానుగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఇక మరోమారు కోచ్ పదవికి అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలని ప్రకటనను జారీ చేసింది బిసిసిఐకి ఇప్పుడు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది.

ఇప్పటికే టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రీలతో పాటు పలువురు ప్రధాన కోచ్ పదవి రేసులో వుండటంతో అ జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఇవాళ తాజాగా మరో సీనియర్ క్రికెటర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయన కూడా టీమిండియా ప్రధాన కోచ్ బరిలో నిలుస్తున్నాడని సమాచారం.

ఇండియా తరపున 162 వన్డేలు, 33 టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం ఆయన జూనియర్ జట్టుకు కోచ్ గా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ తో అతని మూడేళ్ల పదవీకాలం ముగుస్తోంది. దీంతో చీఫ్ కోచ్ పదవిపై వెంకటేష్ ప్రసాద్ ఆసక్తి చూపుతున్నాడు. హెడ్ కోచ్ రేసులో ఇప్పటికే సెహ్వాగ్, టామ్ మూడీ, రవిశాస్త్రి, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh Prasad  Anil Kumble  BCCI  Ravi Shastri  ICC Champions Trophy 2017  cricket  

Other Articles