టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. కోచ్ కుంబ్లేకు మధ్య రేగిన వివాదం.. ఏమిటీ, ఎందుకో తెలియదు కానీ.. అది మాత్రం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇప్పటికీ అనేక మంది సీనియర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీని, ఆయన అహంకార వైఖరిని తూర్పారబడుతున్నారు. అదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏకంగా కోచ్ అవతారం ఎత్తాడు. విరాట్ సేన వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లగా, ఇవాళ తొలివన్డేలో విండీస్ తో తలపడుతుంది.
అయితే, నిన్న చేసిన ప్రాక్టీసులో ధోనీ కోచ్‌లా కొత్త కుర్రాడికి ట్రైనింగ్ ఇచ్చాడు. వెస్టిండీస్ టూర్ కోసం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆ కొత్త కుర్రాడు ధోనీ తర్వాత ధోనీ అంతటి వాడు అవ్వాలని సెలెక్టర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ లేకుండానే ఆడుతోంది. వికెట్ కీపర్‌గా ధోనీకి ఎంతగానో అనుభవం ఉంది. అందుకే ధోనీ ఆ కొత్త కుర్రాడికి మెలకువలు నేర్పించాడు. ధోనీ కోచ్ లా సీరియస్ గా శిక్షణనిస్తుండగా తీసిన ఓ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో ధోనీలాగే పంత్ రాణించాడు. ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more