Captain Mithali Raj Gives a Befitting Reply to a Journo మిధాలీ జవాబుతో పాక్ జర్నలిస్టు మైండ్ బ్లాంక్

Mithali raj stumps reporter when asked about her favourite male cricketer

womens champions trophy 2017, ICC womens Champions Trophy 2017, england, england, Team India, Mithali raj, pakistan journalist, Indian eves, Women’s cricket World Cup, cricket news, cricket, sports news, latest news

Superb response from Indian skipper Mithali Raj. Asked by a reporter who her favourite male player is: "Would you ask a man that?"

మిధాలీ జవాబుతో పాక్ జర్నలిస్టు మైండ్ బ్లాంక్

Posted: 06/23/2017 07:36 PM IST
Mithali raj stumps reporter when asked about her favourite male cricketer

ఐసీసీ పురుషులు ప్రపంచ కప్ ముగియడంలో.. ఇక మహిళల కప్ కోసం ఈ నెల 24 నుంచి పోరు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు కూడా ఇంగ్లాండ్ అతిథ్యమివ్వనుంది. కాగా తొలి మ్యాచులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. కాగా ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ముందు టోర్నీలో పాల్గొనే జట్ల సారథుల కోసం నిర్వాహకులు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత సారథి మిథాలీరాజ్‌ ఈ విందుకు హాజరయ్యారు. క్రికెటర్లతో పాటు వివిధ దేశాలకు చెందిన మీడియా సిబ్బంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

ప్రత్యేక విందు కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్‌ విలేకరి అడిగిన ప్రశ్నకు మిథాలీ దిమ్మదిరిగి మైండ్ బ్లాండ్ అయ్యే సమాధానం ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ జర్నలిస్టు చిన్నబుచ్చుకోవడం తప్ప ఏమీ అనలేని పరిస్థితికి చేరుకున్నాడు. అంలటితో అగకుండా పాకిస్థాన్ జర్నలిస్టుకు మిథాలీ ఎదురు ప్రశ్నలు సంధించడంతో బిక్కముఖం వేసుకున్నాడు. ఇంతకీ విలేకరి అడిగిన ప్రశ్న ఏమిటీ అనేగా మీ సందేహం.

భారత్‌, పాకిస్థాన్ జట్టులో మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని అడిగాడు. అప్పటి వరకు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మిథాలీ సమాధానాలు సవ్యంగా ఇచ్చినా.. పాక్ జర్నలిస్టు ప్రశ్నతో అమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇదే ప్రశ్నను మీరు ఏ ఒక్క క్రికెటర్ నైనా అడుగగలరా..? అని ప్రశ్నించింది. మీ అభిమాన మహిళా క్రికెటర్‌ ఎవరని? వారిని ప్రశ్నించలేని మీరు.. మమ్మల్ని మాత్రం అభిమాన క్రికెటర్ ఎవరని ఎలా అడుగుతున్నారని అమె దగ్ధత స్వరంతో పాక్ విలేఖరిని ప్రశ్నించారు.

వారిని ఎప్పుడూ మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడుగుతారే తప్ప మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరని అడగరు కదా అని అన్నారు. ‘భారత్‌లో మెన్స్‌ క్రికెటర్స్‌కి ఉన్నంత క్రేజ్‌ మహిళా క్రికెటర్లకు ఉండదు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం చూపిస్తారు. మేము మ్యాచ్‌లు ఆడినా టీవీల్లో కనిపించం. బీసీసీఐ ఇటీవలే సోషల్‌మీడియా, టీవీల్లో మా మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నా.. మాకు గుర్తింపు రావడం లేదు ఎందుకని అమె నిలదీశారు. అయితే భారత్, పాకిస్థాన్ రెండు దేశాలలో పరిస్థితులు అలాగే వున్నాయని అమె అన్నారు. తుషార్‌ అరోద్‌ తమ జట్టుకి ప్రస్తుతం కోచ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. ఆయన నేతృత్వంలో మా జట్టు మంచి విజయాలు సాధిస్తోంది అని మిథాలీ ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Women Champions Trophy  england  Team India  Mithali raj  pakistan journalist  cricket  

Other Articles