Kohli respects Kumble decision signing off as India Coach కోచ్ అనిల్ కుంబ్లే నిర్ణయాన్ని గౌరవిస్తున్నా: కోహ్లీ

Kohli respects anil kumble decision signing off as india coach

anil kumble, coach anil kumble, virat kohli, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, sunil gavaskar, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Team India captain virat kohli says anil bhai had taken his desicion to signoff as team india chief coach, as a captain i respect his decision

కోచ్ అనిల్ కుంబ్లే నిర్ణయాన్ని గౌరవిస్తున్నా: కోహ్లీ

Posted: 06/22/2017 09:07 PM IST
Kohli respects anil kumble decision signing off as india coach

టీమిండియా మాజీ ప్రధాన కోచ్ పదవి నుంచి అనీల్ కుంబ్లే తప్పుకోవడంపై తొలిసారిగా స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆయన వీడ్కోలు పలికి వెళ్లిపోవడానికి కారణాలపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ కోహ్లీతో రేగిన వివాదం నేపథ్యంలో గాలివానగా మొదలైన వివాదం కాస్తా పెద్ద తుఫానుగా మారి చివరకు మనస్సు నోచ్చుకున్న కుంబ్లే తన పదవిని వదులుకుని వెళ్లిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యేంత వరకు వెళ్లాయి. దీంతో యావత్ ప్రపంచమే టీమిండియా క్రికెట్లో ఏదో జరుగుతుందని చూపులన్నీ ఇటుగానే తప్పిన తరుణంలో ఇది కాస్తా పెద్ద చర్చనీయంశాంగా మారింది

రేపటి నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కోహ్లీ మీడియాతో మాట్లాడారు. వెస్టిండిస్ పై సిరీస్ లో విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన కోహ్లీ.. కుంబ్లే విషయమై కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో కుంబ్లేతో తనకు ఏర్పడిన వివాదంపై తొలిసారి కోహ్లీ స్పందించాడు. కోచ్‌ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్‌ భాయ్‌ నిర్ణయించారని చెప్పాడు. ఆయన నిర్ణయాన్ని  తాను గౌరవిస్తున్నానని, ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారని వ్యాఖ్యానించాడు.

కుంబ్లే రాజీనామా చేయ‌డానికి కారణం ఏమిటని అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం కోహ్లీ సూటిగా స‌మాధానం చెప్ప‌లేదు. ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు ప్ర‌చార‌మ‌వుతున్నాయ‌ని అన్నాడు. అస‌లు డ్రెసింగ్‌ రూమ్‌కు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు ఈ ఊహాగానాలను ప్ర‌చారం చేస్తున్నారని మండిప‌డ్డాడు. అందులో ఏం జరిగిందన్న విష‌యం పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని వ్యాఖ్యానించాడు. అందులో జ‌రిగిన దాని గురించి బయటకు చెప్పలేనని అన్నాడు. తాను ఎల్ల‌ప్పుడూ డ్రెసింగ్‌ రూమ్‌లో అనుచితంగా వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని అన్నాడు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  icc champions trophy  anil kumble  Virat kohli  bcci  cricket  

Other Articles