Difficult to replicate Anil Kumble says Sehwag కుంబ్లే నిష్క్రమణపై వీరూ విభిన్న స్పందన

Difficult to replicate anil kumble s success as team india coach virender sehwag

anil kumble, coach anil kumble, virender sehwag, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, sourav ganguly, sunil gavaskar, ICC Champions Trophy 2017, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Virender Sehwag remains frontrunner to replace Anil Kumble as India coach, the former India openers said that it will be difficult to step into his former captain’s shoes.

కుంబ్లే నిష్క్రమణపై వీరూ విభిన్న స్పందన

Posted: 06/22/2017 08:04 PM IST
Difficult to replicate anil kumble s success as team india coach virender sehwag

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి నుంచి కుంబ్లే నిష్క్రమించిన నేపథ్యంలో ఆయన స్థానంలోకి రానున్న వ్యక్తుల్లో ముందువరుసలో వున్న టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ అంశమై విభిన్నంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎందరో మాజీ ఆటగాళ్లు, అభిమానులు కోహ్లీకి మద్దతుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పోస్టు పెడుతున్న తరుణంలో ఇదే అంశమై సెహ్వాగ్ ను కలసిన మీడియా విభిన్నమైన స్పందనను అందుకుంది. కుంబ్లే సాధించిన విజయాలను అందుకోవడం కొత్త కోచ్ లకు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

‘కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు నేను ఆటలేదు. అతను నా సీనియర్‌, కెప్టెన్‌ కూడా. ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత కుంబ్లే సారథిగా వ్యవహరించిన సమయంలోనే జట్టులోకి తిరిగి వచ్చా. కుంబ్లే ఆధ్వర్యంలో భారత క్రికెట్‌ జట్టు గొప్ప విజయాలు అందుకుంది. ఇప్పుడు అతని స్థానంలో వచ్చేది ఎవరైనా... ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టతరమైనది’ అని సెహ్వాగ్‌ తెలిపాడు. కోచ్‌ బాధ్యతలు నిర్వహించిన ఏడాది కాలంలోనే టీమిండియా వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌లు గెలిచింది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. కోచ్‌గా అతను సాధించిన విజయాలను అంత తక్కువ సమయంలో మరొకరు అందుకోవడం కష్టం. అతని కోచింగ్‌ శైలిపై ఎలాంటి కామెంట్‌ చేయదలుచుకోలేదు. ఏ ఇతర సీనియర్‌, ఆటగాడైనా అతని కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విజయం సాధించలేరు అని సెహ్వాగ్‌ తెలిపాడు. విదేశీ కోచ్‌ కంటే స్వదేశీ కోచ్‌ అయితేనే జట్టుకు మంచిదని సెహ్వాగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  icc champions trophy  anil kumble  virender sehwag  bcci  cricket  

Other Articles