Virat Kohli shouts at MS Dhoni during semi finals ఎంఎస్ ధోనిపై అరిచేసిన కెప్టెన్..

Virat kohli shouts at ms dhoni as he gives away 5 extra runs

kohli, virat kohli, virat kohli shouts on ms dhoni, dhoni, dhoni 5 run penalty, india 5 run penalty, India vs Bangladesh Champions Trophy, india vs bangladesh, ind vs ban, ind vs ban odi, ind vs ban match, ind vs pak, india vs pakistan, cricket news, sports news, cricket, sports news, latest news

Virat Kohli, after taking over the captaincy of the Indian cricket team, he has been seen taking advice from Dhoni but things turned a bit ugly during the India vs Bangladesh semi-final in the ongoing ICC Champions Trophy.

ఎంఎస్ ధోనిపై అరిచేసిన కెప్టెన్..

Posted: 06/16/2017 08:41 PM IST
Virat kohli shouts at ms dhoni as he gives away 5 extra runs

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్య పగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసిస్తూనే వున్నాడు. అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో మాత్రం అందుకు కొంత బిన్నంగా వ్యవహరించాడు. వీరిద్దరి మధ్య చక్కగా వున్న అనుబంధానికి ఇక బ్రేకులు పడినట్లేనా అన్న అనుమానాలు కలిగే విధంగా మారాయి పరిణమాలు. కోహ్లీ ఏకంగా ధోనిపై అరిచేశాడు. అనవసరంగా ఐదు పరుగులు ఇచ్చిన కారణంగా సహనం కోల్పోయిన కోహ్లీ... ధోనీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే... టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్‌ ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టింది. మధ్యమధ్యలో ఫీల్డింగ్‌ తప్పిదాల వల్ల టీమిండియా ఫీల్డర్లు కొన్ని పరుగులు అప్పగించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఆటగాడు మొసాదిక్ ను రన్ ఔట్ చేసేందుకు యత్నించే క్రమంలో జరిగిన అనవసర తప్పిదం వల్ల భారత్ ఐదు పరుగుల్ని అప్పగించుకుంది. సహచర ఆటగాడి నుంచి బాంతిని అందుకున్న ధోనీ వికెట్లకు విసిరే క్రమంలో పేలవ ఫీల్డింగ్‌ ప్రదర్శన చేశాడు.

ఈ దశలో భారత్‌... బంగ్లాకు అనవసరంగా ఐదు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో కొంత అసహనానికి గురైన కోహ్లీకి ధోనీపై అరిచేశాడు. ఈ మ్యాచ్ లో భారత్‌ ఎక్స్‌ట్రాల రూపంలో 23 పరుగులు ఇవ్వడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ 9వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌.. పాకిస్థాన్‌తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  ms Dhoni  dhoni  India vs Bangladesh  Champions Trophy  semi final  cricket  

Other Articles