Aamer Sohail accuses Pakistan of 'fixing' in Champions Troph ఐసిసి ఛాంపియన్ షిఫ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

Aamer sohail accuses pakistan of fixing their way to champions trophy final

champions trophy, Champions Trophy 2017, India vs Pakistan, Aamer Sohail, India Pakistan Cricket Match, Team India, Pakistan, Match fixing, PCB, Pakistan Cricket, ICC Champions Trophy, Champions Trophy, Aamer Sohail, Sarfaraz Ahmed, England, cricket news, sports news, spots, cricket

Former captain Aamer Sohail has vaguely accused the team of making it to the final of the ICC Champions Trophy on the basis of "external forces".

ఐసిసి ఛాంపియన్ షిఫ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

Posted: 06/16/2017 07:31 PM IST
Aamer sohail accuses pakistan of fixing their way to champions trophy final

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం మొదలైంది. టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిందంటూ ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ సారథి అమిర్ సోహైల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపాయి. దీంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు షాక్ కి గురయ్యారు. టోర్నీలో భాగంగా పాక్‌-ఇంగ్లాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ కు చెందిన ఓ వార్తా సంస్థ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న అమిర్ సొహైల్ ఫైనల్ చేరిన పాక్ జట్టుపై ఆరోపణలు చేశాడు. ఇతరుల కారణంగా పాక్‌ టోర్నీలో మ్యాచ్ లు గెలిచిందని ఆరోపించాడు.

ప్రస్తుత జట్టు సారథి సర్ఫరాజ్‌ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని అన్నాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ జట్టులోని ఆటగాళ్ల కృషి వల్లే విజయం సాధించామని ఎక్కడా చెప్పలేదు.. గమనించండి అని సోహైల్ పేర్కొన్నాడు. తమ విజయానికి ఎవరో సాయం చేశారన్న రీతిలోనే సర్ఫరాజ్ ఎప్పుడూ మాట్లాడేవాడు. దీంతో ఆట వెనుక ఏమి జరిగిందో మేమంతా వూహించగలం. జట్టు విజయానికి కారణమేమిటి అని అడిగినప్పుడల్లా... తాము చేసిన ప్రార్థనలు, అభిమానుల మద్దతు, దేవుడి దయ వల్లే అని చెబుతూ వచ్చాడు. బయటి శక్తుల కారణంగానే పాక్ ఫైనల్ చేరుకుంది.

ఇప్పటికైనా మించి పోయింది లేదు... ఇక నుంచి క్రికెట్ ఆడండి అని సోహైల్ ఈ సందర్భంగా జట్టును కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారడటంతో పాక్ -ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్  ఫిక్సింగ్ జరిగిందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచుల్లో హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ చేరిన ఇంగ్లాండ్ ను పాక్‌ మట్టికరిపించడం కూడా ఇందులో భాగమేనన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  pakistan  Team India  safraaz  Aamer Sohail  Match fixing  cricket  

Other Articles