Hasina speaks to bangladesh heros Shakib, Mahmudullah కివీస్ ను ఓడించిన హీరోలకు ప్రధాని అభినందన

Hasina speaks to shakib mahmudullah after champions trophy heroics

icc champions trophy 2017. Champions Trophy, new zealand vs bangladesh, New Zealand, Bangladesh, shakid al hasan, mahmudullah, Abdul Hamid, Sheikh Hasina, champions trophy, icc champions trophy, michael hussey, virat kohli, cricket

President Md Abdul Hamid and Prime Minister Sheikh Hasina have congratulated the Bangladesh cricket team on their historic win over New Zealand in Champions Trophy

ఆ ఇద్దరు హీరోలకు ప్రధాని అభినందన

Posted: 06/10/2017 07:58 PM IST
Hasina speaks to shakib mahmudullah after champions trophy heroics

న్యూజిలాండ్ జట్టును పసికూనలంటే.. మహామహ దిగ్గజాలున్న విండీస్ జట్టుకు స్థానం కల్పించకుండా ఏకంటా ఐసీసీ టాప్ టెన్ లోకి దూసుకోచ్చి.. చాంపియన్స్ ట్రోఫీ అడటమే కాదు.. పటిష్టమైన న్యూజీలాండ్ జట్టను కూడా చావుదెబ్బ తీసింది. జట్టులో మరీ ముఖ్యంగా షకీబల్ హసన్, మహ్మదుల్లాలు అద్బుతంగా రాణించి న్యూజీలాండ్ పై ఐదు వికెట్లతో విజయం సాధించిన ఈ ఇద్దరి హీరోలకు దేశ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

బంగ్లాదే్శ్ ప్రధాని షేక్ హసినీ కూడా న్యూజీలాండ్ ను ఓడించి విజయాన్ని కైవసం చేసుకున్న ఇద్దరు క్రికెటర్లు హసన్, మహ్మదుల్లాలకు ఫోన్ చేసి మరీ అభినందించారు. పెద్ద జట్టుపై అడుతున్నామన్న ఏ మాత్రం భయం కానీ, జంకు కానీ లేకుండా పక్కా ప్రణాళికతో, ఓర్పుతో అడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారని, ఇది మరపురాని విజయమని అమె అన్నారు. ఇక దేశాధ్యక్షుడు ఎండీ అబ్దుల్ హమీద్ కూడా ఇద్దరు హీరోల ప్రతిభను కొనియాడారు. విజయాలు సోంతం కావాలంటే ప్రజలు కూడా సమిష్టిగా కృషి చేయాలని ఆయన కార్యలయం విడుదల చేసిన ప్రత్యేక ప్రకటనలో స్పష్టం చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. రాస్ టేలర్‌ (63), కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (57) అర్ధ సెంచరీలతో రాణించారు. ఓ దశలో 38 ఓవర్లలో 200/3తో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ ఆ తరువాత నిర్లక్ష్యపు బ్యాటింగ్ తో తొలుత భారీ మూల్యం చెల్లించుకుంది. బంగ్లా బౌలర్ మొసద్దిక్‌ హస్సేన్‌ వారి ఆటలు సాగనివ్వలేదు. వరుస విరామాల్లో బ్రూమ్, అండర్సన్ డకౌట్, నీశమ్ వికెట్లు తీయడంతో కివీస్ కేవలం 265 పరుగులకు అలౌట్ అయ్యింది.

266 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆదిలోనే నాలుగు వికెట్లు కొల్పోయింది. 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లాలు విజయతీరాలకు చేర్చారు. విరిద్దరి మధ్య రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది‌. ఇద్దరు వీరోచిత శతకాలతో రాణించడం బంగ్లా శిభిరంలో నూతనోత్సాహాన్ని నింపింది. అభిమానుల్లో గెలుపు అశలను సజీవం చేసింది. అస్ట్రేలియా జట్టు ఓటమిపైనే బంగ్లా సెమీస్ అశలు పెట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  New Zealand  Bangladesh  shakid al hasan  mahmudullah  Abdul Hamid  Sheikh Hasina  cricket  

Other Articles