CAC backs Anil Kumble to continue as coach కుంబ్లే కోచ్ భవితవ్యంపై నిర్ణయం వాయిదా..?

Cricket advisory committee backs anil kumble to continue as coach

anil kumble, coach anil kumble, Sachin Tendulkar, Sourav Ganguly, VVS Laxman, BCCI CEO Rahul Johri, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, sourav ganguly, sunil gavaskar, ICC Champions Trophy 2017, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

The Cricket Advisory Committee (CAC) led by Sachin Tendulkar, Sourav Ganguly and VVS Laxman has backed the continuation of Anil Kumble as coach of the Indian team.

కుంబ్లే కోచ్ భవితవ్యంపై నిర్ణయం వాయిదా..?

Posted: 06/09/2017 06:11 PM IST
Cricket advisory committee backs anil kumble to continue as coach

టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో అతడి సేవలనే ఇంకా కొనసాగించేందుకు బిసిసిఐ సుముఖత చూసుతుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. కుంబ్లే భవితవ్యం తేల్చేందుకు మరికొంత సమయం కావాలని గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా సంఘం కోరింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, సలహా సంఘం సభ్యులు, బోర్డు సీనియర్ సభ్యులు కుంబ్లే ఉద్వాసన పట్ల విముఖతతో వున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో అతడినే కోచ్ గా కొనసాగించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముగ్గురు సభ్యుల సలహా సంఘం ఇవాళ రెండు గంటల పాటు సమావేశమై కొత్త కోచ్ నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత తమకు మరింత సమయం కావాలని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి తెలిపారు. గతేడాది జులైలో నియామకమై 17 మ్యాచుల్లో 12 గెలిపించి విజయవంతమైన కుంబ్లేను తొలగిస్తున్నప్పుడు సమయం అడగడం సబబే అని అమితాబ్‌ కాంత్‌ అన్నారు.

ఇంకా చెప్పాలంటే ముంబయిలో జూన్‌ 26న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వరకు కోచ్‌ నియామక ప్రక్రియ వాయిదా వేయాలని సీనియర్‌ అధికారుల నుంచి బీసీసీఐకి లేఖలు వచ్చినట్లు తెలిసింది. సారథి కోహ్లీకి ఇష్టం లేదని ప్రస్తుత కోచ్‌ని తొలగించి కొత్తవారిని నియమిస్తే అతడికి క్రికెట్‌ పరిపాలన నిర్ణయాలపై అధికారం ఇచ్చినట్లు అవుతుందని బీసీసీఐ పాలక వర్గం భావిస్తోంది. అందుకే కుంబ్లే కొనసాగింపునకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  icc champions trophy  anil kumble  sourav ganguly  tendulkar  vvs laxman  bcci  cricket  

Other Articles