Pakistan topple Proteas on DL ఛాంపియన్స్ ట్రోఫిలో పాక్ బోణీ కొట్టిందిలా..

Rain hastens pakistan s first win of icc champions trophy 2017

champions trophy 2017, ICC Champions Trophy 2017, england, pakistan vs south africa, pak vs sa, icc champions trophy 2017, champions trophy, edgbaston, icc group b teams, cricket news, cricket, sports news, latest news

South Africa were left with no answers to Pakistan in their ICC Champions Trophy 2017 encounter as the rains hastened confirmation of their defeat.

ఛాంపియన్స్ ట్రోఫిలో పాక్ బోణీ కొట్టిందిలా..

Posted: 06/08/2017 03:22 PM IST
Rain hastens pakistan s first win of icc champions trophy 2017

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్ తో జరిగిన మ్యాచ్ లో గెలుపు దరిదాపుల్లోకి కూడా రాకుండా ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్ లో మాత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. వరుణుడు మ్యాచ్ కు అడ్డంకిగా నిలవడంతో.. ఉత్తమ రన్ రేట్ ను పరిగణలోకి తీసుకుని డక్ వర్త్ లూయూస్ విధానంతో పాకిస్థాన్ ను విజేతగా ప్రకటించారు అంపైర్లు. ఈ మ్యాచ్ అద్యంతం వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధతి ప్రకారం పాకిస్థాన్ దక్షిణాఫ్రికాపై 19 పరుగులతో విజయం సాధించినట్లు ప్రకటించారు.

భారత్‌ చేతిలో ఓటమితో ట్రోఫీ ప్రారంభించిన పాక్ కు తొలి విజ‌యం దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులకే పాక్ బౌలర్లు కట్టడి చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్ మధ్యలోనే వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి పాక్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. తిరిగి మ్యాచ్ ప్రారంభించే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పాక్ ఆడిన ఓవర్లలో మెరుగైన రన్ రేట్ ప్రకారం దక్షిణాఫ్రికాపై పాక్ 19 ప‌రుగుల తేడాతో నెగ్గినట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  england  pakistan  south africa  icc group b teams  cricket  

Other Articles