Ashwin Wins Cricketer Of The Year Award అశ్విన్ ఖాతాలోకి ‘‘క్రికెటర్ అఫ్ ది ఇయర్’’ అవార్డు

Ravichandran ashwin wins international cricketer of the year award

Ravichandran Ashwin, cricketer of the year, Virat Kohli, Suresh Raina, Champions Trophy, Champions Trophy 2017, Washington Sundar, Sunil Gavaskar, Shubman GillIndian Premier League, IPL 2017, Team India, cricket

India off-spinner Ravichandran Ashwin won the coveted International Cricketer of the Year award at the CEAT Cricket Rating (CCR) International awards 2017.

అశ్విన్ ఖాతాలోకి ‘‘క్రికెటర్ అఫ్ ది ఇయర్’’ అవార్డు

Posted: 05/24/2017 10:00 PM IST
Ravichandran ashwin wins international cricketer of the year award

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. 2016-17 సంవత్సరానికి గాను ‘క్రికెటర్‌ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాడ్‌తో జరిగిన అండర్‌-19 సిరిస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన యువ బ్యాట్స్‌మన్ షుభమన్ గిల్ కు యంగ్‌ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన సియట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డులు-2017 కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ చేతల మీదుగా అశ్విన్‌ ఈ అవార్డు అందుకున్నాడు.

ఈ సందర్భంగా తాను తొలిసారి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సునీల్ గవాస్కర్‌ ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయాన్ని అశ్విన్‌ గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించిన వాషింగ్టన్‌ సుందర్‌ గురించి మాట్లాడుతూ... ఐపీఎల్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకుందని తెలిపాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసినట్లు పలువురు తనతో చెప్పినట్లు వెల్లడించాడు.

45 టెస్టుల్లోనే 250 వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డు సృష్టించాడు. 250పైగా వికెట్లు తీసిన 12వ ఆటగాడు అశ్విన్‌. ఇప్పటివరకు 49 టెస్టులాడిన అశ్విన్ 92 ఇన్నింగ్స్ ల ద్వారా 275వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమంగా 10వికెట్లను ఏడుసార్లు తీయగా, ఐదు వికెట్లను 25సార్లు తీశాడు. వన్డేల్లో 104 ఇన్నింగ్స్ ల ద్వారా 145వికెట్లు సాధించాడు. గత ఒక్క ఏఢాదిలోనే అశ్విన్ అత్యద్భుతంగా రాణించి మొత్తం 99వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles