Virat Kohli, Anil Kumble push BCCI for fast bowling coach బౌలింగ్ కోచ్ కోసం కోహ్లీ, కుంబ్లే డిమాండ్

Virat kohli anil kumble push bcci for fast bowling coach

Virat Kohli, Anil Kumble, BCCI, Indian Cricket Team, Sanjay Bangar, Umesh Yadav, Mohammed Shami, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Ishant Sharma, ICC champions trophy, cricket

Virat Kohli and Anil Kumble, in a discussion with BCCI’s CoA last week, have pressed for the selection of a fast bowling coach.

బౌలింగ్ కోచ్ కోసం కోహ్లీ, కుంబ్లే డిమాండ్

Posted: 05/23/2017 08:17 PM IST
Virat kohli anil kumble push bcci for fast bowling coach

భారత క్రికెట్ జట్టులో అనేక మంది యువ బౌలర్లు బాగా రాణిస్తున్నారని, ఈ తరుణంలో వారికి మెళకువలు చెప్పేందుకు అనుభవజ్ఞుడైన బౌలింగ్ కోచ్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న డిమాండ్ ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లేలు బిసిసిఐ ఎదుట పెట్టారు. ఇటీవల కాలంలో టీమిండియా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తుండటంతో వారికి మరింత పదును పెడితే బాగుంటుందన్న వీరి అలోచనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎదుట పెట్టారు. ఇందులో భాగంగా బౌలింగ్ కోచ్ ఏర్పాటు చేస్తే బాగుంటదని బీసీసీఐ నిర్వాహకుల కమిటీ(సీఓఏ)కి విజ్ఞప్తి చేశారు.

బౌలింగ్ కోచ్ గా వున్న భరత్ అరుణ్ పదవీ కాలం ముగిసిపోయిన తరువాత ఇప్పటి వరకు బౌలింగ్ కోచ్ లేకపోవడం జట్టుకు కొంత ఇబ్బందికరంగా వుందన్న అభిప్రాయాన్ని కోహ్లీ, కుంబ్లేలు వ్యక్తం చేశారట. అయితే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆ క్రమంలోనే భారత్ బౌలింగ్ కోచ్ ప్రతిపాదన మరొకసారి ఈ ద్వయం తెరపైకి తీసుకువచ్చింది. మరి దీనిపై బిసిసిఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  bowling coach  virat kohli  ICC champions trophy  cricket  

Other Articles