Mithali Raj to lead in Womens World Cup టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ గా మిథాలీరాజ్

Women s cricket mithali raj to lead in world cup

Mithali Raj, ICC Women’s World Cup 2017, Indian women's cricket team, Women's Cricket, Board of Control for Cricket in India, Harmanpreet Kaur, Smriti Mandhana

Experienced batswoman Mithali Raj will lead India in the ICC Women’s World Cup beginning in England and Wales from June 24, the Board of Control for Cricket in India announced .

మహిళల ప్రపంచకప్: టీమిండియా జట్టు కెప్టెన్ గా మిథాలీరాజ్

Posted: 05/16/2017 09:56 PM IST
Women s cricket mithali raj to lead in world cup

ఐసీసీ మహిళల ప్రపంచకప్ కు బిసిసిఐ జట్టును ప్రకటించింది. టీమిండియా మహిళల జట్టుకు అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్‌ నేతృత్వం వహించనుంది. వచ్చే నెల 24 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌కు సంబంధించి 15 మందితో కూడిన భారత జట్టును బిసిసిఐ ఇవాళ ప్రకటించింది. ఇందులో మిథాలీరాజ్‌కే జట్టు పగ్గాలు అప్పజెబుతూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 11వ మహిళల ప్రపంచ కప్ కు 1973, 1993 తరువాత 2017లోనూ మూడవ పర్యాయం ఇంగ్లాండ్ అతిధ్యం ఇవ్వనుంది. జూన్ 24 నుంచి జూలై 23 వరకు నెల రోజుల పాటు మహిళా ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క పర్యాయం కూడా భారత మహిళల జట్టు ప్రపంచ కప్ ను సాధించకపోవడం గమనార్హం.

కాగా, 2005లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్‌ కప్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అదే ఇప్పటికీ భారత మహిళల అత్యుత్తమ ప్రదర్శన. ప్రపంచ కప్ కు 15 మంది సభ్యులతో టీమిండియా జట్టను బిసిసిఐ ప్రకటించింది. భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ ప్రీత్‌ కౌర్, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పునమ్‌ రౌత్, దీప్తి శర్మ, జులన్‌ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పునమ్‌ యాదవ్, నుజ్‌హత్‌ పార్వీన్, స్మృతీ మందనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali Raj  ICC Women’s World Cup  Indian women's cricket team  Women's Cricket  BCCI  

Other Articles

 • Dravid asked us to play our natural game in england prithvi shaw

  ద్రావిడ్ మాకు స్వేఛ్ఛనిచ్చారు: పృథ్వీ షా

  Jun 18 | ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టు అద్బుతంగా రాణించడానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని జట్టు ఓపెనర్ పృథ్వీ షా వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో భారత-ఎ... Read more

 • Ms dhoni takes rigorous net session at ncacademy ahead of england tour

  ఇంగ్లాండ్ టూర్ కోసం కఠినంగా శ్రమిస్తున్న ధోనీ..!

  Jun 18 | భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ధోనీ... Read more

 • Ruthless india will not take afghanistan lightly ajinkya rahane

  అప్ఘనిస్తాన్ తో అత్యుత్తమంగా రాణిస్తాం: అజింక్య రహానె

  Jun 13 | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా.. టీమిండియాతో చారిత్రక తొలి టెస్టు ఆడబోతున్న అఫ్గానిస్థాన్‌ జట్టుపై తాము అత్యుత్తమంగా రాణించేందుకు జట్టుసభ్యులంతా సిద్దంగా వున్నారని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు.... Read more

 • Will implement mentor ashwin techniques on teamindia mujeeb ur rahman

  అశ్విన్ నేర్పిన మెలకువలను ప్రయోగిస్తా

  Jun 13 | భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకు ఓ కొత్త తరహా డెలివరీని నేర్పించాడని అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్... Read more

 • It s a privilege to play afghanistan in their first test ajinkya rahane

  అప్ఘనిస్తాన్ తో చారిత్రక టెస్టు అడటం ఓ గౌరవం: రహానే

  Jun 12 | అఫ్గానిస్థాన్ తో జరగనున్న చారిత్రక టెస్టు మ్యాచ్ లో ఆడబోతుండటాన్ని ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నానని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం నుంచి... Read more

Today on Telugu Wishesh