Zafar Ansari announces retirement aged 25 పాతకేళ్లకే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అన్సారీ

England rising star zafar ansari in shock retirement

Zafar Ansari, England national cricket team, Surrey, Test cricket, county, England, sports, cricket

England international Zafar Ansari has announced his retirement from all forms of cricket to pursue other career opportunities only six months from making his Test debut.

పాతకేళ్లకే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అన్సారీ

Posted: 04/26/2017 08:39 PM IST
England rising star zafar ansari in shock retirement

ఇంగ్లండ్ అల్ రౌండర్ జాఫర్ అన్సారీ తన క్రికెట్ కెరీర్ కు ఆదిలో ముగింపు పలికాడు. ఇకపై తాను క్రికెట్ ను అడనంటూ తన అభిమానులతో పాటు అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు.  తాజాగా తన నిర్ణయాన్ని  తెలిపిన అన్సారీ.. ఇక క్రికెట్ అనేది తన జీవితంలో ఒక భాగంగానే మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న అన్సారీ 25 ఏళ్లకే క్రికెట్ క్రీడ నుంచి వీడ్కోలు తీసుకోవడం ఇంగ్లండ్ క్రికెట్ లో అలజడి రేపింది. తన క్రికెట్ కెరీర్ ను అర్థాంతరంగా ముగించడానికి తనకు వేరే లక్ష్యాలు ఉండటమే కారణమని అన్సారీ స్పష్టం చేశాడు.

క్రికెట్ కెరీర్ ను ఒక్కసారిగా ముగిస్తున్నానని చెప్పడం తనకే చాలా బాధాకరంగా వుందని చెప్పాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో తాను వీడ్కోలు పలుకక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాడు. తనకు వేరే లక్ష్యాలు ఉన్నాయని వాటిని అందుకోవడం తన జీవితంలో చాల ముఖ్యమని.. ఆటను కొనసాగిస్తే వాటిని మిస్ అవుతానన్న అందోళనలోనే తాను క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నానని అన్నాడు. ఇది చాలా కఠిన నిర్ణయమని కానీ ఆకతాయితనంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని కూడా అన్సారీ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zafar Ansari  England national cricket team  Surrey  Test cricket  county  England  sports  cricket  

Other Articles