ఆర్పీఎస్ కు షాక్.. దుబాయ్ కి స్మీత్.. Steve Smith in Dubai for vacation before RPS vs SRH clash

Steven smith goes on a break ahead of sunrisers hyderabad clash

rising pune supergaints vs sunrisers hyderabad, steve smith, IPL 2017, MS Dhoni, Rising Pune Supergiant, RPS, Smith, steve smith, Steven smith, sunrisers hyderabad, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Rising Pune Supergiant skipper Steven Smith took some time off from the hectic IPL schedule in order to spend some time with his family.

ఆర్పీఎస్ కు షాక్.. దుబాయ్ కి స్మీత్..

Posted: 04/20/2017 09:21 PM IST
Steven smith goes on a break ahead of sunrisers hyderabad clash

రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ తో సుదీర్ఘ టెస్టు సిరీస్ కు వచ్చిన అస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆ తరువాత ఇక్కడ జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా కంటిన్యూ కావడంతో కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోయాడు. చాలాకాలంగా కుటుంబంతో దూరంగా వున్న కారణంగా ఆయన ఐపీఎల్‌-10వ సీజన్ నుంచి కొన్ని రోజులు పాటు ఆయన దూరం కానున్నాడు. సరిగ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ నెల 22న మ్యాచ్ జరుగనున్న క్రమంలోనే ఆయన దూరం కానున్నారు. ఈ విషయాన్ని స్మిత్‌ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్‌ వెళ్తున్నట్లు తెలిపాడు.

కుటుంబసభ్యులతో కొన్ని రోజులు గడిపేందుకు గాను తాను దుబాయ్‌ వెళ్తున్నట్లు రైజింగ్ ఫూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ వెల్లడించాడు. తన కుటుంబసభ్యుల నుంచి చాలా రోజులుగా దూరంగా వున్నందునే వారితో వారం రోజలు పాటు సమయాన్ని కేటాయించాలని భావించానని తెలిపారు. దీంతో కొన్ని రోజులు ఐపీఎల్‌కు తాను దూరం కానున్నట్లు తెలిపాడు. ఇక సన్ రైజర్స్ తో పాటు మరో పుణె  మ్యాచ్ కు కూడా స్మిత్‌ దూరం కానున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడిన పుణె కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి... పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rising pune supergaints  steve smith  dubai  vacation  cricket  

Other Articles

Today on Telugu Wishesh