ఎంఎస్ ధోనికి ఊరటనిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. SC Quashes Criminal Case Against MS Dhoni

Sc quashes case against dhoni for portraying himself as god

ms dhoni, dhoni, dhoni magazine cover, ms dhoni supreme court, dhoni sc, dhoni magazine case, ms dhoni controversy, dhoni controversies, supreme court, bcci, india cricket, cricket india, cricket news, cricket, sports news, sports

The Supreme Court quashed a criminal complaint lodged against cricketer MS Dhoni for allegedly hurting religious sentiments by depicting himself as Lord Vishnu on a magazine cover.

ఎంఎస్ ధోనికి ఊరటనిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం..

Posted: 04/20/2017 07:26 PM IST
Sc quashes case against dhoni for portraying himself as god

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ధోనీపై దాఖలైన క్రిమినల్ కేసు సంబంధించిన పిటీషన్‌ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కేసులో జార్ఖండ్ డైనమైట్ తప్పిదమేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో ధోని ఎవరి మత వివ్వాసాలకు భంగం కల్గించలేదని పేర్కోంది

2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లో అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ కేసు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లింది.

ఈ ఫొటో వివాదంలో ధోనీ ప్రమేయం లేదని కేసును కొట్టివేయాల్సిందిగా అతని తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. ధోనీ ఉద్దేశపూర్వకంగా లేదా కించపరచాలనే భావనతో చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ధోనీకి ఈ కేసు నుంచి ఉపశమనం లభించడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఈ కేసు విషయంలోనే ఇబ్బందులను ఎదుర్కోంటున్న ధోని దాని ప్రభావంతోనే అటపై కూడా అసక్తి కనబర్చలేదన్న వాదనలు వినిపించాయి. దీంతో ఇక ధోని తన తడాఖా చూపెడుతాడని  అభిమానులు అశగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Lord Vishnu advertisement  supreme court  criminal complaint  cricket  

Other Articles

Today on Telugu Wishesh