కోహ్లీకి నవ్వు తెప్పించిన జడేజా కొత్త హెయిర్ స్టైల్.. Virat Kohli Trolled Ravindra Jadeja For His New Look

Ipl 2017 virat kohli trolled ravindra jadeja for his new look

Ravindra Jadeja, Gujarat Lions, IPL 2017, Indian Premier League, IPL 10, virat kohli, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

In the ongoing tenth season of IPL, Ravindra Jadeja came up with a new hairstyle and it has now become one of the talking points on social networking websites.

కోహ్లీకి నవ్వు తెప్పించిన జడేజా కొత్త హెయిర్ స్టైల్..

Posted: 04/20/2017 05:47 PM IST
Ipl 2017 virat kohli trolled ravindra jadeja for his new look

ఐపీఎల్ సీజన్-10కి చెందిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో స్పెషాలిటీ ఏంటలో తెలుసా.. ఐపీఎల్ లో తన జట్టు సభ్యుడు కాకపోయినా.. టీమిండియా జట్లు అందులోనూ టెస్టు జట్టులో కీలకమైన అల్ రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త హెయిర్ స్టైల్ పై జోకులు పేల్చి మరీ పగలబడి నవ్వుతున్న పోటో. అసలు విషయం అర్థమైంది కానీ ఎవరు నవుతున్నారన్న విషయంలో క్లారీటీ లేదని అంటారా..? ఇంకెవరు టీమిండియా కెప్టెన్, అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

సరికొత్త హెయిర్ స్టైల్ తో వచ్చిన రవీంద్ర జడేజాను చూసిన కోహ్లీ పడిపడి నవ్వాడంతో పాటు ఆతని పక్కనున్న గుజరాత్ లయర్స్ పేస్ బౌటర్ ప్రవీణ్ కుమార్ ను కూడా నవ్వించాడు. అలా నవ్వుతుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విభన్నమైన హెయిర్ స్టైల్ తో పాటు గడ్డాన్ని కూడా విభిన్నంగా స్టైల్ చేయించుకున్ని రవీంద్ర జడేజాను బెంగళూరు, గుజారాత్ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కోహ్లీ చూశాడు. దీంతో ప్రాక్టీస్ ను కాసేపు పక్కనబెట్టి గుజరాత్ జట్టు దగ్గరకు వచ్చి జడేజాను తేరపార చూశాడు.

ఈ సమయంలో ఆటగాళ్లంతా కోహ్లీని పలకరించగానే... జడేజాను విచిత్రమైన స్టైల్ లో చూసిన కోహ్లీ పడిపడి నవ్వాడు. కోహ్లీకి ప్రవీణ్ కుమార్ కూడా జతకలిశాడు. వారిద్దరూ నవ్వుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే అండర్ 19 భారత జట్టుకు ఆడినప్పటి నుంచి కోహ్లీ జడేజా స్నేహితులు. కాగా, డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ ఒకేలా కనిపించడం చూసి.. తాను కొంత విభిన్నంగా వుండాలని అనుకున్నానని, దీంతో పాటు తాను గత కొంతకాలంగా అలాగే కనిపించడంతో మార్పు మంచిదేనని ఇలాంటి స్టైల్ మేయింటేన్ చేస్తున్నానని జడేజా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra Jadeja  Gujarat Lions  IPL 2017  Indian Premier League  IPL 10  virat kohli  cricket  

Other Articles

Today on Telugu Wishesh