మళ్లీ కష్టాల్లో బెంగళూరు.. డివిలయర్స్ దూరం AB de Villiers to miss Lions clash with injury

Ab de villiers to miss lions clash with injury

gl vs rcb, rcb vs gl, rcb gl, gl rcb, gujarat lions, ab de villiers injury, de villiers injury, injury de villiers, virat kohli, ipl 2017, cricket news, cricket

AB de Villiers, the Royal Challengers Bangalore batsman, will miss clash against Gujarat Lions in Rajkot due to his recurring back trouble.

మళ్లీ కష్టాల్లో బెంగళూరు.. డివిలయర్స్ దూరం

Posted: 04/18/2017 08:48 PM IST
Ab de villiers to miss lions clash with injury

ఐపీఎల్ పదవ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు అంచనాలకు మించి రాణించడం లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో క్రిస్ గేల్ సహా పలువురు విధ్వంసకర బ్యాట్స్ మెన్లు వున్న జట్టు.. తమ అంచనా స్థాయిలో ఱాణించలేకపోతుంది. తొలుత విరాట్ కోహ్లీ లేకపోవడం కారణమని భావించగా, విరాట్ వచ్చిన తరువాత కూడా జట్టు అశించిన స్థాయిలో ప్రదర్శనను ఇవ్వలేకపోతుంది. ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న సమయంలోనే జట్టుకు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మరోసారి గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయ్యాడు.

తొలి రెండు మ్యాచ్ లకు గాయం కారణంగా జట్టుకు దూరమైన ఏబీ.. ఇవాళ గుజరాత్ లయన్స్ తో జరిగే మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. గాయం తనను వెంటాడంతో మరొకసారి జట్టు కీలక మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చిందని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్ లు ఆడిన రాయల్ చాలెంజర్స్ కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి చివరి స్థానంలో కొనసాగుతుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో విజయం తప్పక అవసరమనుకున్నా.. డివిలియర్స్ దూరం కావడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AB de Villiers  IPL-10  Royal challengers banglore  gujarat lions  BCCI  cricket  

Other Articles

Today on Telugu Wishesh