ఐపీఎల్ లో భువనేశ్వర్ అరుదైన ఘనత Bhuvneshwar Kumar joins elite club

Bhuvneshwar kumar joins elite club

Sunrisers Hyderabad, Bhuvaneshwar Kumar, IPL-10, Malinga, cricket

SRH fast bowler Bhuvneshwar Kumar's magical performance with the ball made him to join the elite club of bowlers who have taken 100 wickets in IPL.

ఐపీఎల్ లో భువనేశ్వర్ అరుదైన ఘనత

Posted: 04/18/2017 05:26 PM IST
Bhuvneshwar kumar joins elite club

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాన్ని అందించడంతో కీలకపాత్ర పోషించిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇటు తన కెరీర్ లోనూ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వంద వికెట్లను సాధించిన క్లబ్ లో భువి చేరిపోయాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనతను అందుకున్నాడు. మరొకవైపు అతి తక్కువ మ్యాచ్ ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా అతి తక్కువ మ్యాచ్ ల్లో వంద వికెట్లను సాధించిన తొలి ఆటగాడిగా ఉన్నాడు. లసిత్ మలింగా 70 మ్యాచ్ లో ఈ ఘనత సాధించగా, భువీ 81 మ్యాచ్ ల్లో సాధించాడు.

సన్ రైజర్స్ జట్టుకు 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భువీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తక్కువ పరుగులనిస్తూ.. తన ఓవర్లను పూర్తి చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల భాగస్వామ్యాలను విచ్చిన్నం చేస్తూ జట్టు విజయ డంకా మోగించడంతో తన వందు పాత్రను పోషిస్తున్నాడు. 2016 సీజన్లో 17 మ్యాచ్ లు ఆడిన భువీ 23 వికెట్లతో అగ్రస్దానంలో నిలిచి జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోశించాడు. సన్ రైజర్స్ లో చేరిన తర్వాత భువీ తన బౌలింగ్ ప్రతిభను చాటాడు. 2014లో 20 మ్యాచ్ లు ఆడి 20 వికెట్లతో బౌలర్ల పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో నిలిచాడు. 2015 లో 18 వికెట్లు పడగొట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunrisers Hyderabad  Bhuvaneshwar Kumar  IPL-10  Malinga  cricket  

Other Articles