టీమిండియాకు మరో ది వాల్ చత్తీశ్వర్ పూజరా.. Pujara breaks Rahul Dravid's record and slams third double hundred

Cheteshwar pujara played outstanding innings on day 3 of 3rd test

australia, Australia cricket, Australia, India, Team India, India vs Australia, Cheteshwar Pujara, Rahul dravid, VVS Laxman, Cricket news, India, India cricket, India cricket team, India vs Australia, Indian cricket news, Test cricket

Cheteshwar Pujara played the longest innings of his Test career, as he went onto score his third double century off 525 balls to help India take a crucial lead in Ranchi.

టీమిండియాకు మరో ది వాల్ చత్తీశ్వర్ పూజరా..

Posted: 03/19/2017 05:09 PM IST
Cheteshwar pujara played outstanding innings on day 3 of 3rd test

రాంచీ టెస్టులో టీమిండియా తన జోరును కొనసాగించింది, పూజారా వికెట్ ను తీసేందుకు గత రెండు రోజులుగా ప్రయత్నిస్తున్న అసీస్ బ్యాట్స్ మెన్లకు ముచ్చెమటలు పట్టాయే తప్ప వారి ఆశ తీరలేదు. దీంతో టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ తరువాత పూజారా మరో ది వాల్ గా పేర్కొంటున్నారు కామెంటేటర్లు. మూడవ రోజు తొలి ఇన్నింగ్స్ ను 603/9 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది టీమిండియా అసీస్ పై అదిక్యాన్ని సంపాదించింది. సాహాతో కలసి చటేశ్వర్ పూజారా అసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. తన టెస్టు కెరీర్ లో మూడవ డబుల్ సెంచరీతో పుజారా(202) అత్యద్భుతంగా రాణించగా, మరోవైపు వృద్దిమాన్ సాహా (117) కూడా సెంచరీతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

అయితే ఆసీస్‌పై పుజారాకు ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 11వది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ విజయ్ మర్చెంట్ రికార్డును పుజారా సమం చేశాడు. టెస్టుల్లో మూడో సెంచరీ సాధించిన సాహా.. టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ధోనీ ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. పుజారా, సాహా కలిసి భారత్ తరఫున ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు, ఒకీఫ్ 3 వికెట్లు, హజిల్ వుడ్, లియాన్ చెరో వికెట్ తీసుకున్నారు. 152 పరుగుల లీడ్ సాధించింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ నాలుగో రోజు ఆటముగిసేసరికి 23 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. మరో ఎనిమిది వికెట్లను తీస్తే భారత్‌దే విజయం. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌(17), లియోన్‌(2)ల వికెట్లను జడేజా పడగొట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India vs Australia  Cheteshwar Pujara  Rahul dravid  VVS Laxman  cricket  

Other Articles