స్మిత్ తప్పను సమర్థించని అదేశ మాజీ కెప్టెన్ The incident should be investigated, says Steve Waugh

The incident should be investigated says steve waugh

india vs australia, steve smith, steve waugh, virat kohli, australia, india, test series, sports, cricket

Former Australia captain Steve Waughsaid such behaviour “cannot be accepted from a captain”.

స్మిత్ తప్పను సమర్థించని అదేశ మాజీ కెప్టెన్

Posted: 03/09/2017 07:02 PM IST
The incident should be investigated says steve waugh

బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారత్ అస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ పై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యవహరించిన తీరును దేశ మాజీ కెప్టెన్ స్టీవ్ వా తప్పుబట్టాడు. తమ దేశ క్రికెట్ కెప్టెన్ ను వెనకేసుకు రాకుండా ఆయన స్మిత్ చేసింది ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఒక మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ కు సంకేతాలు ఇవ్వడం కచ్చితంగా తప్పేనన్నాడు. తనకు ఆ సమయంలో బుర్ర పనిచేయలేదంటూ స్మిత్ సమర్ధించుకోవడన్ని కూడా వా ఎత్తి చూపాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ఏ పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సి వచ్చినా అది తప్పేనని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.

స్టీవ్ స్మిత్ చేసింది తప్పే.  అలా చేసి ఉండాల్సింది కాదు. మళ్లీ స్మిత్ ఆ తరహా తప్పు చేస్తాడని నేను అనుకోవడం లేదు. డీఆర్ఎస్ పై స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ కు సంకేతాలు ఇవ్వడం నేను లైవ్ లో చూడలేదు. రికార్డు అయిన తరువాత మాత్రమే చూశా. అతను తప్పు చేసినట్లు కనబడింది. దాన్ని స్మిత్ అంగీకరిస్తాడని నేను ముందుగానే అనుకున్నా. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో ప్రతీ దానికి అనవసర రాద్దాంతమైతే జరుగుతుంది. ఇదే 15 ఏళ్ల క్రితం జరిగి ఉంటే ఇంత చర్చ ఉండేది కాదు. ఏదైనా స్మిత్ తప్పు చేశాడు. ఇకపై చేయడని నేను అనుకుంటున్నా'అని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  steve waugh  virat kohli  australia  india  test series  sports  cricket  

Other Articles