బెంగళూరు టెస్ట్.. ఆ ఇద్దరి మీదే ఆశలు | Pujara, Rahane Lead Hosts' Resistance in Bangalore Test.

India fight back to hold 126 run lead on day 3

Bangalore Test, Australia versus India, India versus India, Cheteshwar Pujara Ajinkya Rahane, Border–Gavaskar Trophy 2017, Bangalore Test Day 3, Rahane and Pujara

Border–Gavaskar Trophy Bangalore Test. India were 213 for four at stumps in their second innings on Monday in the second Test at Bengaluru, leading Australia by 126 runs. Cheteshwar Pujara (79) and Ajinkya Rahane (40) were batting at close of play on the third day.

బెంగళూర్ టెస్ట్ డే 3 : 126 ఆధిక్యంలో భారత్

Posted: 03/06/2017 05:58 PM IST
India fight back to hold 126 run lead on day 3

బోర్డర్ అండ్ గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడి నిలబడింది. తొలి ఇన్నింగ్స్ లో పేలవంగా ఆడి విమర్శలపాలైన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ కేఎల్ రాహుల్ మరోసారి భారత బ్యాటింగ్ ను ఆదుకున్నాడు.

అర్ధసెంచరీతో రాణించిన రాహుల్ సహచరులతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో రాహుల్ (51) రాణించగా, అభినవ్ ముకుంద్ (16), విరాట్ కోహ్లీ (15), రవీంద్ర జడేజా (2) లు విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా మిస్టర్ డిపెండబుల్స్ ఛటేశ్వర్ పుజారా (73), అజింక్యా రహానే (40) ఆసీస్ బౌలర్ల సహనాన్ని, సామర్థ్యాన్ని పరీక్షించారు.

వీరిద్దరినీ విడదీసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టులోని బౌలర్లందర్నీ ప్రయోగించాడు. తొలి ఇన్నింగ్స్ హీరో నాధన్ లియాన్ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో పుజారా, రహానేలు 203 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత జట్టు 72 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో 126 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్ వుడ్ మూడు వికెట్లతో రాణించగా, ఒకీఫ్ ఒక వికెట్ తీసి అతనికి సహకారమందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Border–Gavaskar Trophy 2017  Bangalore Test  Pujara  Ajinkya Rahane  

Other Articles