బెంగళూరులో రోహిత్.. కంగారెత్తించేందుకు రెడీ..! Rohit Sharma mingles with Team India in B'lore

I only wish to compete with myself says fit again rohit sharma

rohit sharma, india vs australia, virat kohli, ajinkya rahane, r sridhar, india australia pune test, india australia bengaluru test, m chinnaswamy stadium, national cricket academy, vijay hazare trophy, mumbai, rohit sharma thigh injury, cricket, cricket news, latest sports news, rohit sharma indian cricket team, rohit sharma news, karun nair, r ashwin, kuldeep yadav, sports, cricket news, cricket

While the Indian team was occupied with its practice drills, it was happy to welcome Rohit Sharma to the nets.

బెంగళూరులో రోహిత్.. కంగారెత్తించేందుకు రెడీ..!

Posted: 03/03/2017 08:49 PM IST
I only wish to compete with myself says fit again rohit sharma

తొడ కండరాల గాయం కారణంగా నాలుగు నెలలుగా  ఆటకు దూరమై తిరిగి కోలుకున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో ముంబై తరపున రోహిత్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడటానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని  సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రోహిత్.. .త్వరలో భారత్ జట్టులో చోటు సంపాదిస్తాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

తనకు ఎవరితోనూ పోటీ కాదని విషయాన్ని ఈ సందర్భంగా రోహిత్ స్పష్టం చేశాడు. మరో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే, కరుణ్ నాయర్ల నుంచి ఏమైనా పోటీని ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు రోహిత్ కాదనే సమాధానం ఇచ్చాడు. ఆ ఇద్దరితో తనకు ఎటువంటి పోటీ లేదని రోహిత్ తెలిపాడు.

' నా కెరీర్ ఆశాజనకంగానే ఉంది. నేనెప్పుడూ జట్టులో పోటీ గురించి ఆలోచించ లేదు. నీవు ఆటగాడి మెరుగుపడని పక్షంలో మాత్రమే పోటీ గురించి ఆలోచిస్తాం. నాకు అటువంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. నాకు నేనే పోటీ. ఇలా అనవసరపు విషయాలు గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదు. భారత్ జట్టు తరపున ప్రతీ మ్యాచ్ ఆడాలనే కోరుకుంటా'అని రోహిత్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  india  australia  karun nair  Team India  bangalore  cricket  

Other Articles