అభిమానులతో అవేదనను పంచుకున్న పఠాన్ Irfan Pathan pens emotional note for his fans

Irfan pathan posts emotional letter to his fans on twitter

IPL auction, team India, Irfan Pathan, IPL-10, T20 World Cup, indian premier league 2017, sports, cricket

Irfan Pathan, who still remains one of the most popular cricketers in the country, took Twitter to share a very emotional message with his fans

అభిమానులతో అవేదనను పంచుకున్న పఠాన్

Posted: 02/22/2017 06:41 PM IST
Irfan pathan posts emotional letter to his fans on twitter

ఆల్ రౌండర్, బరోడా పేసర్ ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదవ సీజన్ వేలంలో తనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపక పోవడంపై బాధతో స్పందించాడు. ట్వంటీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఇర్ఫాన్ కీలక ఆటగాడు. భారత జట్టులోకి రావడానికి తాను ఎంత కష్టపడ్డాడో, ఎంతో తీవ్రమైన సమస్యలను తాను ఎలా అధిగమించాడో ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ లేఖ పోస్ట్ చేశాడు.

'2010లో ఐదు ఫ్రాక్చర్స్ అయితే క్రికెట్ ఇక జీవితంలో క్రికెట్ ఆడలేవని ఫిజియో, ట్రైనర్ నాకు చెప్పారు. వీలైనంత ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా డ్రీమ్. అలాంటిది ఫిజియో మాటలకు ఎంతో కలవరపడ్డాను. ఎంత నొప్పి, బాధనైనా భరిస్తాను.. కానీ టీమిండియాకు ఆడకుండా ఉండలేనని ఫిజియోను తేల్చి చెప్పేశాను. క్రికెట్ మళ్లీ ఆడేందుకు మాత్రమే కష్టపడలేదు. భారత జట్టులో మళ్లీ అవకాశం కోసమే కెరీర్లో, జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

ప్రస్తుతం నా ముందు మరో సమస్య (ఐపీఎల్-పదవ సీజన్) ఉంది. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశలను వదులుకోలేను. ఈ సమస్య నుంచి నేను బయటపడాలని చాలా మంది క్రికెటర్లు నాకు మద్దతుగా నిలిచారు' అని తన అభిమానులకు తెలియజేస్తూ పోస్ట్ లో ఇర్ఫాన్ పఠాన్  రాసుకొచ్చాడు. భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఇర్ఫాన్ దేశవాలీ టోర్నీల్లో సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే ఇర్ఫాన్ ను ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకునే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL auction  team India  Irfan Pathan  IPL-10  T20 World Cup  indian premier league 2017  sports  cricket  

Other Articles